ePaper
Thursday, August 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నూతన ఇంట.. సున్నం లలిత ఆత్మీయ పలకరింపు

నూతన ఇంట.. సున్నం లలిత ఆత్మీయ పలకరింపు

📰 Generate e-Paper Clip

ధారబోయిన పోతురాజు–రాధమ్మ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ

పొలిటికల్ పవర్, ఆగస్టు 27 దమ్మపేట: అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని చల్లమప్పగూడెం గ్రామంలో ధారబోయిన పోతురాజు–రాధమ్మ దంపతుల నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నపురెడ్డిపల్లి మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్‌ నాయకురాలు సున్నం లలిత హాజరై నూతన గృహాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా నూతన గృహ యజమానులను ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఇంటిలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.

నూతన గృహప్రవేశం కుటుంబ జీవితంలో ఎంతో ఆనందకరమైన, మరపురాని ఘట్టమని సున్నం లలిత పేర్కొన్నారు. కుటుంబ సభ్యులంతా ఐకమత్యంతో సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని శుభకార్యాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ గృహప్రవేశ వేడుకలో ధారబోయిన పోతురాజు–రాధమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!