ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

“న్యాయ కళాశాల కోసం జీఎస్పీ పోరుబాట”

📰 Generate e-Paper Clip

భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి

 “ఆరో రోజుకు చేరిన రిలే దీక్షలు.. ఆదివాసీల భూ సమస్యలు పరిష్కరించాలని పూనెం సాయి దొర డిమాండ్”

పొలిటికల్ పవర్, భద్రాచలం, అక్టోబర్17: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గోండ్వానా సంక్షేమ పరిషత్ (జీఎస్పీ) ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. శనివారం ఆరో రోజు దీక్షలను జీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆదివాసీల భూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ విద్య అందుబాటులోకి వస్తే గిరిజన యువతకు చట్టాలపై అవగాహన పెరగడంతో పాటు, తమ హక్కుల పరిరక్షణకు అవసరమైన న్యాయ సహాయం పొందే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల భూములకు రక్షణ కల్పించే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టాన్ని కూడా సమర్థంగా అమలు చేసి, ఆదివాసీల భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు, చట్టాలపై కొందరు గిరిజనేతరులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, ఆదివాసీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని పూనెం సాయి దొర విమర్శించారు. ఆదివాసీ రిజర్వేషన్ల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తమ సమాజ హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం గళం విప్పాలని అన్నారు. ఆదివాసీల హక్కుల విషయంలో ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందే వీరయ్య ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు, ఆదివాసీల భూ సమస్యల పరిష్కారం, గిరిజన చట్టాల పటిష్ట అమలు కోసం దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ దీక్షలో జీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందే వీరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, జీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దన్, జీఎస్పీ నాయకులు సన్నాసి సుబ్బయ్య, కారం మల్లయ్య, గుండి పుల్లయ్య, సోడి కోటేశ్వరరావు, సోయం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

*తల్వార్లతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు : ఎస్సై సూరజ్*

     *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదచీఫ్ చీఫ్ ఎడిటర్  పి రమేష్కొణిజర్ల పోలీస్ స్టేషన్    ఖమ్మంపుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్లతో...

సర్వసభ్య సమావేశం కు హాజరైన డిఆర్డిఓ విద్యా చందన 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ అక్టోబర్ 23 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో డిఆర్డిఓ మరియు ఏ సి ఎల్ బి విద్యా...

సర్వసభ్య సమావేశం కు హాజరైన డిఆర్డిఓ విద్యా చందన 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ అక్టోబర్ 23,2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో డిఆర్డిఓ మరియు ఏ సి ఎల్ బి విద్యా చందన విబిజి...
error: Content is protected !!