– బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ పేరుమీద మహిళలకు పంపిణీ చేసిన చీరలు వరి చేల్లో తూకాలకు కాపలా కాస్తున్నాయి,
– కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం,
– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19. 2026.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా అభివృద్ధిని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిఅన్నారు.శుక్రవారం
దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బిపిఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ మహిళల చీరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ పేరుమీద మహిళలకు పంపిణీ చేసిన చీరలు వరి చేల్లో తూకాలకు కాపలా కాషాయని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ హాయంలో గ్రామాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని, సకాలంలో వారికి బిల్లులు వారి అకౌంట్ లలో పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, పంపిణీ చేశామని, గృహ జ్యోతి పథకం ద్వారా
200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500 కే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ చేశామని, దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ పై సన్నబియ్యాన్ని ఇస్తున్నామని, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి రెండో విడతలో మరో 250 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని
ఆయన అన్నారు.ఈ కార్యక్రమములో మున్సిపాలిటీ కమిషనర్ సైదయ్య, మదనాపురం మార్కెట్ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి యాదవ్, మాజీ జెడ్పిటిసి పి జె. బాబు,కిసాన్ రైతు సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సలీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శలు పి. కృష్ణారెడ్డి , ఎన్ జె. బో హెజ్, కొత్తకోట పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, మాజీ కొత్తకోట పట్టణ అధ్యక్షులు మేస్త్రి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల జితేందర్ నాథ్ రెడ్డి, రావుల కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు జె. అఖిల తండ్రి సుభాష్, పుచ్చలపల్లి సుధ రామ్మోహన్ రెడ్డి, ఎన్ జే. బోయెజ్, భీమ చంద్ర కాంత్,అస్మత్ ఖాన్ సలీం ఖాన్,కరాటే అబ్దుల్ నబి, మిరాసు పల్లి సాయి రెడ్డి,మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు జేయం. మిషేక్, సుభాష్, జెసిబి రాములు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మూలమల్ల వెంకటేశ్వర్ రెడ్డి, ముజీబ్, కొత్తకోట మైనార్టీ అధ్యక్షులు ఎజాస్ అలీ, మాజీ వార్డు సభ్యులు నరేంద్ర సాగర్, దేవరకద్ర అసెంబ్లీ అధ్యక్షులు ముస్తఫా, పి. రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మోహన్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు అప్పరాల సర్పంచ్ మాసన్న, బూతు కూర్ సర్పంచ్ బంగారయ్య, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ బి. శివరాములు, ఫిషర్ మ్యాన్ సందా వెంకటేష్, వడ్డే వాటా సర్పంచ్ రామ్ లాల్ నాయక్, గోకరయ్య,సాయిల్ యాదవ్,మహమ్మద్ ఖలీల్, ఎండి. ఫెరోస్, లతీఫ్, సుల్తాన్, భాస్కర్, రాములు యాదవ్, ముంత లక్ష్మయ్య యాదవ్, నా గబుచ్చన్న నాయుడు, భాస్కర్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


