ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రకృతిని ప్రేమించడం ఒక కళ పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక...

ప్రకృతిని ప్రేమించడం ఒక కళ పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 05 2026: కొంచం అభిరుచి, ఇంకొంచం ఆలోచన, మరికొంచం ఓపిక ఉంటే చాలు ఇంటిని నందనవనంలా తీర్చిదిద్దవచ్చని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ కుమార్.బుధవారం పట్టణంలోని మరికుంటలో తన ఇంటిపై మిద్దె తోటను పెంచుతున్న జైని శ్రీనివాసులు, జయలక్ష్మి దంపతులను సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ… ప్రకృతి ప్రతి జీవరాశి మనుగడకు సంపూర్ణంగా దోహద పడుతుందని ప్రకృతిని ప్రేమించడం, కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు. కరోనా మానవుని జీవితంలో పెను మార్పులకు కారణమయ్యిందని, ప్రజలకు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగేలా చేసిందని అన్నారు. అంతేగాక తాజాగా లభించే ఆకు కూరలు,కూరగాయలు తమకు ఉన్న స్థలంలోనే పండించుకోవడం,రకరకాల ఔషధ మొక్కలను,పండ్ల చెట్లను పెంచుకోవడం హాబీగా చేసుకున్నారని తెలిపారు. ఆ కోవలోనే శ్రీనివాస్ జయలక్ష్మి దంపతులు తమ మిద్దె తోటలో దాదాపు రెండు వందల రకాల మొక్కలను పెంచుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు.పర్యావరణ ప్రేమికులైన ఈ దంపతులను కళా వేదిక సభ్యులు శాలువ జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్, బైరోజు చంద్ర శేఖర్, దేశి రాములు యాదవ్,బండారు శ్రీనివాస్, రామ్ రెడ్డి, జయంత్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఎడ్విన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!