ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

పామిరెడ్డిపల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆదికవి శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ… రామాయణ మహాకావ్యాన్ని రచించిన ఆదికవి వాల్మీకి మహర్షి గొప్ప పరివర్తనకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. రత్నాకరుడిగా జీవితం ప్రారంభించి, తన తపస్సు, సాధనతో మహర్షిగా ఎదిగిన మహనీయుడని కొనియాడారు. త్యాగం, సత్యం, ధర్మం, న్యాయం వంటి విలువలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. సీతమ్మకు ఆశ్రయం కల్పించి, లవకుశులకు విద్యాబుద్ధులు నేర్పిన కరుణామయుడని గుర్తుచేశారు. వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన బోధించిన విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాములమ్మ, మాజీ ఎంపీపీ మనే పరెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ, నరేష్, యాదయ్య, యాదమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి, రమేష్ గౌడ్, కొంకల నరసింహ, వెంకటయ్య, వాల్మీకి కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర...

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ ఊరటి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: అక్టోబర్ 26 మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని శ్రీరంగాపూర్...

జై వాల్మీకి నినాదాలతో మార్మోగిన తీర్మాలయాపల్లి

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు.. విగ్రహానికి పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదానం బైక్ ర్యాలీ కార్యక్రమాలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ...

అజ్జకొల్లులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

  జై వాల్మీకి, జై శ్రీరామ్ నినాదాలతో బైక్ ర్యాలీ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: మదనాపురం మండలం అజ్జకొల్లు...
error: Content is protected !!