పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంఘం అధ్యక్షులు పి. విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సత్యరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నరేష్, మన్యంకొండ, గ్రామ సర్పంచ్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, పెంటయ్య, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు (ఏఓ, ఏఈఓలు), పీఏసీఎస్ సీఈఓ మరియు సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.
