ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 29 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు, దిగ్గజ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ఫిజికల్ డైరెక్టర్ పి. నరసింహస్వామిని కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. క్రీడల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి, క్రీడాస్ఫూర్తి, అంకితభావం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో దృఢమైన శరీరంతో పాటు దృఢమైన మనస్సును, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ఉత్సాహంతో ఆడాలని, నిజాయితీగా పోటీపడాలని, విజయాన్ని వినయంతో స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల పట్ల తమ ఆసక్తిని చాటుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. “ఆడండి.. అభ్యసించండి.. ప్రదర్శించండి.. విజయం సాధించండి” అనే స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!