ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష

📰 Generate e-Paper Clip

⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

💰 రూ.15 వేల జరిమానా… బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం

✳️ అనంతపురం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

👮‍♂️ నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం పోక్సో (POCSO) ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.

📌 కేసు వివరాలు

అనంతపురం కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికపై 2021లో లైంగిక దాడి జరిగింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 11/2021గా కేసు నమోదు చేశారు.

🔎 సమగ్ర విచారణ అనంతరం నిందితుడిపై మోపబడిన అభియోగాలు రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.

⚖️ ప్రధాన నిందితుడికి శిక్ష

అనంతపురం బిజెపి కొట్టాలకు చెందిన ప్రధాన నిందితుడు (A-1) జోన్న వెంకటేష్కు 366, 376 IPC మరియు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది.

జరిమానా చెల్లించకుంటే మరో 4 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది.

💰 బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం

బాధితురాలికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా (నష్టపరిహారం) మంజూరు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

👏 పోలీసులకు ఎస్పీ అభినందనలు

ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన…

👮‍♂️ అప్పటి ఐఓ కె. ధరణి కిషోర్

(ప్రస్తుతం ఎస్బీ ఇన్‌స్పెక్టర్)

👮‍♂️ ఎ. శ్రీనివాసులు

(ప్రస్తుతం తిరుపతి అడిషనల్ ఎస్పీ)

👮‍♂️ పర్యవేక్షణ అధికారి డీఎస్పీ ఎం. శివప్రసాద్

👮‍♂️ కోర్టు కానిస్టేబుల్ డి. కిరణ్ కుమార్ (PC 2530)

లను జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు అభినందించారు. 👏

🛡️ బాలలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.

👮‍♂️ అనంతపురము జిల్లా పోలీసు.

Latest Articles

దళితుల అంటే దాడి చేసే వాళ్ళు కాదు

పొలిటికల్ పవర్ ప్రతినిధి  తెలంగాణవాళ్లు కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కట్టు బానిసలు...

 ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం...

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి:...

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై...

Related Articles

 ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం రూ.2కే అందించిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. పేదరికం కారణంగా ఏ కుటుంబమూ ఆకలితో అలమటించకూడదని...

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లాస్థానిక పోరుకు సిద్ధం కావాలి: ధర్మాన కృష్ణదాస్స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ....తోలేటి శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల...
error: Content is protected !!