ePaper
Monday, September 14, 2026
📄 ePaper

పోలీసులు బాధితుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

– ప్రతి కేసు వివరాలను సకాలంలో సీసీటీఎన్ఎస్‌లో నమోదు చేయాలి,

– పోలీసు అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించాలి,

– నూతన సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి,

– శాంతిభద్రతల పరిరక్షణలో వనపర్తి జిల్లా పోలీసుల పనితీరుపై ఐజీపీ ప్రశంసలు,

– వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఐజిపి సమీక్ష సమావేశం,

– హైదరాబాద్ ఐజీపీ షానవాజ్ ఖాసీం ఐపీఎస్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 16.2026: ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి పోలీసులు అండగా ఉన్నారనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని మల్టీ జోన్-2 హైదరాబాద్ ఐజీపీ. షానవాజ్ ఖాసీం ఐపీఎస్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, సత్వర పరిష్కార చర్యలు చేపడుతూ మర్యాదపూర్వకంగా మానవీయ దృక్పథంతో వ్యవహరించడం ద్వారా పోలీసు-ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన తెలిపారు. మంగళవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఐజీపి. షానవాజ్ ఖాసీం, ఐపీఎస్ జోగులాంబ జోన్-7 డీఐజి. ఎల్.ఎస్. చౌహాన్ ఐపీఎస్ తో కలిసి సందర్శించి జిల్లా పోలీసు పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ ఐజీపీ, డీఐజీ గార్లకు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఐజీపీ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి జిల్లాలో నమోదైన యూఐ, గ్రేవ్, ఎస్సీ.ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సమీక్ష సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ పోక్సో మరియు ఎస్సీ.ఎస్టీ కేసుల్లో 60 రోజులలోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన “ప్లాన్ ఆఫ్ యాక్షన్” ఉండాలని, రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. లాడ్జీలు, పాత నేరస్తులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.గ్రామాల సందర్శనలకు ప్రాధాన్యత పోలీసు అధికారులు, వీఆర్వోలు, బీట్ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీసీటీఎన్ఎస్ డేటా ఎంట్రీపై ప్రత్యేక దృష్టి

పోలీస్ స్టేషన్ రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్‌లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5 ఎస్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాల నివారణకు చర్యలు సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, రాత్రి గస్తీల ద్వారా ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరుపై ప్రశంసలు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ చేపడుతున్న చర్యలపై ఐజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. వనపర్తి డిఎస్పీ, శ్రీ గిరిబాబు ఐజిపి కి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఐజిపి డిఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటారు. గతంలో వనపర్తి ఏఎస్పీగా పనిచేసిన రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేష్ మీనా, ఐపీఎస్, ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ, గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ,సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి సీఐ, సుగంధ రత్నం, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూరు సీఐ, శివకుమార్, సీసీఎస్ సీఐ, అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

కోట్ల ఆస్తులు ఉన్నా... పక్కన మనిషి లేకపోతే ఆ జీవితం ఎంత...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్పొలిటికల్ పవర్...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!