ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోలీస్ ఓపెన్ హౌస్

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, ఆయుధాలు, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోఅక్టోబర్.25.2026.మహిళలభద్రత,మాదకద్రవ్యాలనిర్మూలన,సమాజభద్రతపైచైతన్యంతీసుకురావడంఈఓపెన్,హౌస్.కర్యక్రమంప్రధానఉద్దేశమనిజిల్లా ఎస్పీ. డి. సునీత రెడ్డి అన్నారు.శనివారం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ. డి. సునీత రెడ్డి, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్.శాఖలోవినియోగించేవివిధరకాలఆయుధాలను ప్రదర్శించి, వాటి గురించివిద్యార్థులకుఅవగాహన కల్పించారు. అలాగే షి టీమ్స్, భరోసా కేంద్రం,యాంటీ నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మహిళల భద్రత, మహిళలకు అందించేసహాయసేవలు,మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి నివారణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలపై వివరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ. డి. సునీత రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసంవిధినిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి త్యాగాలు పోలీసు శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, సమాజ భద్రతపై చైతన్యం తీసుకురావడం ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ గారు తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, సమాజంలో బాధ్యతాయుతపౌరులుగాఎదగాలనిసూచించారు.ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు, మహిళలు మరియు విద్యార్థుల భద్రతకు వనపర్తి జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, కొత్తకోట సీఐ రమేష్, ఆత్మకూరు సీఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు...

ఉప్పాడ తీరంలో అలజడి..

ఎగసిపడుతున్న సముద్రపు అలలు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి!

ఓటరు నమోదు కోసం ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టిన అశ్వారావుపేట మండల...

Related Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు న్యూస్ కాకటి సత్య ప్రకాష్, ప్రతినిధి టేకులపల్లి, నవంబర్ 27 2026: ఇల్లందు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో...

మోజర్ల లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు 

వాల్మీకి మహర్షి ఆశయాలు అందరికీ ఆదర్శం: సర్పంచ్ కె. చంద్రశేఖర్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026:...

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి...
error: Content is protected !!