ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణనల్గోండప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ జూన్ 8 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల లో భాగంగా సోమవారం 17వ వార్డుల్లో ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల నిర్వహణలో భాగంగా సంతోష్ మాత, సంజయ్ కాలనీ లో వార్డు సభ ఏర్పాటు చేయనైనది.ఇట్టి సమావేశంలో ఎస్ డబ్ల్యూ ఎం నియామకాల 2026 గురించి, వర్షపు నీటి సంరక్షణ, కాలువల శుభ్రత, వర్షాకాల సంసిద్ధత, త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, గురించి వార్డ్ ఆఫీసర్ పి నామ ప్రజలకు తెలియజేశారు. అలాగే వార్డు సభకు వచ్చినటువంటి ప్రజలు ముఖ్యంగా సంతోషిమాత కాలనీ, సంజయ్ కాలనీలో కోతుల నుండి మరియు కుక్కల నుండి రక్షణ కల్పించాలని వార్డు ప్రజలు తమ సమస్యలను వాడు సభలో అధికారుల, ప్రజా ప్రతినిధుల, దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పొట్ట మధు , కో- ఆప్షన్ నెంబర్ వైయస్ సిపోరమ్మ కరుణాకర్, మున్సిపల్ అధికారి జి రాకేష్ కుమార్ వార్డ్ ఆఫీసర్ పి నామ, ఆర్ పి షామా పర్వీన్, అంగన్వాడి టీచర్ బాలమణి, వివిధ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!