ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తక సామాగ్రి వితరణ..

దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తక సామాగ్రి వితరణ..

📰 Generate e-Paper Clip

బాలికల చదివే దేశ భవిష్యత్తు.. మండల విద్యాశాఖ అధికారి ఓ. నిర్మల

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక పిన్ 9టీవీ రిపోర్టర్ ముళ్లపాటి ప్రసాద్ రావు కలసపాడు మండలం కడప జిల్లా: కాశినాయన మండలం మూలపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజు దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తక సామాగ్రి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాశినాయన మండలం విద్యాశాఖ అధికారి ఓ. నిర్మల మేడం పాల్గొనడం జరిగింది. దాతలైన మిద్దెల గ్రామానికి చెందిన వీర నారాయణమ్మ మరియు పోరుమామిళ్ల శ్రీ వేంగమాంబ ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థల కరస్పాండెంట్ కుమారుడు జి రామ్ కుమార్ లు కలిసి ఆరువేల రూపాయలు విలువచేసే పుస్తక సామగ్రి అయిన నోటు పుస్తకాలు ,పలకలు, టేబుల్ పుస్తకాలు, ఎరేజర్స్ ,మెండర్, కాఫీ రైటింగ్ బుక్స్ మూలపల్లి పాఠశాలకి అందించడం జరిగింది. దాతలు సమర్పించిన పుస్తక సామాగ్రిని మండల విద్యాశాఖ అధికారిని ఓ నిర్మల, పాఠశాల వైస్ చైర్మన్ సుబ్బమ్మ మరియు తల్లిదండ్రులు విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారిని మాట్లాడుతూ పుస్తక సామాగ్రి అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాఠశాల అభివృద్ధి కోసం మరియు విద్యార్థుల చదువు కోసం ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ ఆచారి చేస్తున్న విశేష కృషిని మండల విద్యాశాఖ అధికారిని కొనియాడడం జరిగింది. ఉపాధ్యాయుల చిత్తశుద్ధి వల్లనే సమాజంలో మంచి మార్పు సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర ఆచారి, కళావతి, పాఠశాల వైస్ చైర్మన్ సుబ్బమ్మ, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!