ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే లక్ష్యం

– శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం. మహేందర్ర్ రెడ్డి,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్.18.2026.ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనిజాతీయపతాకాన్నిఆవిష్కరించారు.వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పోలీస్ శాఖ ద్వారా ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం  వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాలపై ప్రగతి నివేదికను చదివి వినిపించారు.వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్.సురభి,ఎస్పీ.సునీతారెడ్డి,వనపర్తిశాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి ఉపస్థితులయ్యారు.తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇట్టి వేడుకలకు హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ కలెక్టర్ కి, అదనపుకలెక్టర్లకు,జిల్లాన్యాయమూర్తులకు, జిల్లా ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులకు, వివిద శాఖల జిల్లా అధికారులకు, విద్యార్థులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పుర ప్రముఖులకు నాహృదయ పూర్వక ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.చరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 78 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమయిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని, అందుకే ఈ రోజున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్నిఘనంగాజరుపుకుంటున్నామన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత555.సంస్థానాలు ఇండియన్ యునియన్ లో కలిశాయి, హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్ర రాజ్యాంగ ఉండేందుకు నిర్ణయించుకుందన్నారు. ఈ ప్రాంత ప్రజల మేరకు భారత ప్రభుత్వం “ఆపరేషన్ పోలో” చర్య ద్వారా సెప్టెంబర్ 17,1948నతెలంగాణప్రాంతాన్నిఇండియన్ యునియన్ లో భాగం చేసిందన్నారు. ఈ నేపద్యంలో తెలంగాణలో ప్రజా పాలన దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజలకు ఇచ్చినహామీలనుఒక్కొక్కటిగాఅమలుచేస్తున్నదన్నారు.

మహాలక్ష్మి పథకం మహిళలకు వరం
ఈ ప్రభుత్వం ప్రతి మహిళలను మహాలక్ష్మిగా చేయాలనే సంకల్పంతో మహిళలకు ఆర్టీసీబస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. జిల్లాలో ఇప్పటివరకు 3 కోట్ల 84 లక్షల మంది మహిళలు ఉచితంగాప్రయాణించారు.ఇందుకుగానురూ.161.16 కోట్లను ప్రభుత్వం భరించిందన్నారు.2026-27 విద్యా సంవత్సరానికి 35,951 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల యూనిఫామ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 53,902 యూనిఫామ్ లను కుట్టించి 41,150 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

రూ. 500లకే వంటగ్యాస్ సరఫరా
నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పేద ప్రజల పై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం రూ.500కేవంటగ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో 85,383 వేల మందికి 5,12,439 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం రూ. 15.71 కోట్ల వ్యయంతో సబ్సిడీ అందించిందన్నారు.జిల్లామహిళా సమాఖ్యభవననిర్మాణంరూ.5కోట్లఅంచనావ్యయంతో చేపట్టి పనులు పూర్తయి ప్రారంభానికి సిద్దంగా వుందన్నారు.

వడ్డీ లేని రుణాలు
జిల్లాలోని 2025-26 సం. కి గాను 9,023 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని ఋణాలు పథకం క్రింద 7 కోట్ల 72 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు.అదేవిధంగా వనపర్తి జిల్లా లోని 5 మునిసిపాలిటీల లో 2023-24 2024,25సంవత్సరాలకుసంబంధించి956సంఘాలకు రూ. 3 కోట్ల 16 లక్షలు వడ్డీ లేని ఋణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ
పేదలకు మెరుగైన వైద్యసేవ, వైద్య సదుపాయాల కల్పన అందించేఉద్దేశంతో”రాజీవ్,ఆరోగ్యశ్రీపథకాన్ని” రూ.10 లక్షల వరకు ఉచితవైద్యం పొందేలా పేదలకు అందుబాటులోకి తేవడం జరిగిందని,జనవరి1,2026 నుండి ఈ పథకం ద్వారా జిల్లాలోఇప్పటివరకు6,816 మందికి 22 కోట్ల 14 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉచిత వైద్య చికిత్సలు అందించడం జరిగిందన్నారు.

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
రైతు భీమా పథకం ద్వారా 2025-26 సంవత్సరంలో జిల్లాలో 702 మంది రైతులకు రూ.35.10 కోట్లను వారి కుటుంబాలకు అందించామన్నారు. రైతు భరోసా పథకం కింద 2026 వానాకాలం సీజన్‌లో 1,82,768 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.212.32 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.కర్నేతండా ఎత్తిపోతల పథకం రూ. 76 కోట్ల 19 లక్షల అంచనా వ్యయంతో చేపట్టి పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాలలో చెరువులు నింపి 4 వేల 235 ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుంది.

ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది 38. శాతం లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మినుములు, కంది, జొన్న, ఆముదం, కూరగాయలు తదితర ఆరుతడి పంటలనుసాగుచేసేలారైతులకువిస్తృతంగాఅవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సమావేశాల ద్వారా, కరపత్రాల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిఅవగాహనకల్పించడంజరిగిందన్నారు.రాష్ట్రంలోనే అత్యధికంగా 90 శాతం మినుములు మనజిల్లాలో రాయితీక్రింద1,127క్వింటాళ్ళుపంపిణిచేయడంజరిగిందనితెలియజేయడానికిసంతోషిస్తున్నానన్నారు. అదేవిధంగా వేరుశనగ విత్తనాలు పూర్తి 100. శాతం సబ్సిడితో 3 వేల 750 ఎకరాలు సాగుచేయడానికి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు.పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ప్రతి రేషన్ కార్డ్ దారునికి సన్న బియ్యం అందించే ఉద్దేశంతో వనపర్తి జిల్లాలో 1,83,568 రేషన్ కార్డుల ద్వారా సన్న రకం బియ్యం ఆగస్ట్, సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాలకు ఒకేసారిలబ్దిదారులకుపంపిణిచేయడంజరుగుచున్నదన్నారు.జిల్లా లో 26,465 కొత్త రేషన్ కార్డుల తో పాటు 1,04,000 మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డులలో చేర్చడం జరిగిందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వనపర్తి జిల్లాలో 5,874 గృహాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 92 శాతం గృహాల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో రూ.170.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోజిల్లాతెలంగాణ లో 13 వ స్థానంలో వుందన్నారు. 2వ విడత కింద ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 2 వేల ఇండ్లు మంజూరు కాగా మొదటిగా గుడిసెలు లేనితెలంగాణ రాష్ట్రముగ తీర్చిదిద్దుటలో భాగంగా జిల్లాలో 689 మంది లబ్దిదారులను గుర్తించి వారిలో అర్హులైన 560 మంది లబ్దిదారులకు ఇండ్లు మంజూరు చేయగా వాటిలో 120 ఇండ్లు బేస్ మెంట్ వరకు పూర్తి అయి 17. శాతం ముందంజలోఉన్నదనితెలియజేయడానికి సంతోషిస్తున్నానన్నారు.  అదేవిధంగా ప్రభుత్వము ప్రతి నియోజకవర్గమునకు పైకప్పు భర్తీ పథకం కింద 500 ఇండ్లు కేటాయించగా నెలాఖరులోగా235మంది అర్హులైన వారిని గుర్తించి సంబంధిత లబ్దిదారులకు రూ. 2 లక్షల రూపాయలఆర్ధికసహాయంఅందించడం జరుగుతుందన్నారు.

గృహజ్యోతి పథకం
గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 85,423 కుటుంబాలకు 21,60,000 జీరో బిల్లులుజారీచేయడంజరిగింది.ఇప్పటివరకుప్రభుత్వం రూ.62 కోట్ల 60 లక్షల సబ్సిడి అందచేయడం జరిగిందన్నారు.చేయూతపథకంద్వారావికలాంగులు, వృద్ధులు, వితంతువులు మరియు ఇతర అర్హులైన పేదలకు ప్రతి నెలా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో 70,342 మందికి నెలకు రూ.16 కోట్ల33లక్షలుపెన్షన్,కోసంఇవ్వడంజరుగుతుందన్నారు.

వన మహోత్సవం, పర్యావరణ పరిరక్షణ
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 17.09 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 8.65 లక్షలమొక్కలునాటినట్లుతెలిపారు.మొక్కలసంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతీసుకోవాలనిసూచించారు.
ప్రజావాణి
పారదర్శకత, జవాబుదారితనంతో ప్రజలకు సేవలు అందించడంలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుండి రెవిన్యూ డివిజన్ స్థాయికి మరియుమండలస్థాయికివిస్తరించడంజరిగిందన్నారు. దీని ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రాసెస్ చేసి ఫిర్యాదులనుప్రజావాణిపోర్టల్,ద్వారాపరిష్కరించడం జరుగుతుందన్నారు.

విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం
వనపర్తి జిల్లాలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరై పనులు వివిధదశల్లోకొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాలు, పాఠశాల బ్లాకుల నిర్మాణానికి రూ.13.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.47.50 కోట్లు మంజూరై పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన అభ్యాస వాతావరణం కల్పించడం, బోధన- అభ్యసన ప్రక్రియను మరింతప్రభావవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 85 CM Kits అదే విధంగా KGBV లలో 69 CM Kits విద్యా సామగ్రిఅందుబాటులోఉంచడంజరిగిందన్నారుపెద్దమందడి మండలంలోని ZPHS వెల్టూర్ పాఠశాలను తెలంగాణపబ్లిక్,స్కూల్,గాఎంపికచేయడంజరిగిందని తెలిపారు.వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రజల్లోప్రభుత్వఆసుపత్రులపైనమ్మకంపెరిగిందన్నారు. వనపర్తి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి రూ.203.95 కోట్లు, పెబ్బేరులో రూ.11.20 కోట్లతో, ఆత్మకూరులో రూ.22 కోట్ల అంచనావ్యయంతో50పడకలసామాజిక ఆరోగ్య కేంద్రాలనిర్మాణపనులుకొనసాగుతున్నాయని తెలిపారు.50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ జిల్లా జనరల్ ఆసుపత్రికి మంజూరు అయి ప్రారంభానికి సిద్ధంగా వున్నదన్నారు. మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 19,643 మందిని మధుమేహ బాధితులుగా గుర్తించి “మిషన్ మధుమేహ దృష్టి” కార్యక్రమం ద్వారా వారందరికీ డయాబెటిక్ రెటినోపతి పరీక్షలు నిర్వహించగా, వారిలో 1,269 మందికి డయాబెటిక్ రెటినోపతి ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. వారికి సంబంధిత ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన పరీక్షలు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి
రైతులభూసమస్యలనుశాశ్వతంగాపరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని అమలుచేస్తున్నట్లుతెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు12,851దరఖాస్తులుస్వీకరించి, వాటిలో 11,403 దరఖాస్తులను పరిష్కరించినట్లు వెల్లడించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, జిల్లాలో 2,221 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్,ద్వారాఅవగాహనకార్యక్రమాలునిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మహిళల రక్షణలో భాగంగా ఈవ్ టీజింగును నిరోధిస్తూ షీ Team మరియు AHTUల ద్వార మహిళల రక్షణకు భరోస కల్పించడానికి అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలు నిర్భయంగాజీవించేవాతావరణంకల్పించిందన్నారు.బాల్య వివాహాల, రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసుశాఖకీలకపాత్రపోషిస్తోందన్నారు.డయల్-100 ద్వారావేగవంతమైనపోలీసింగ్,ద్వారాఇప్పటివరకు ప్రజల్లో భద్రతా భావన పెంచడం జరిగిందన్నారు. ఇప్పటి నుండి డయల్-100 స్థానంలో డయల్–112 ద్వారా అత్యవసర సేవలైన POLICE, FIRE & AMBULANCE సేవలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు.

జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరం
వనపర్తి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు డా. పట్నం మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింతముందుకుతీసుకెళ్లేందుకుఅందరూసమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు ఆశీస్సులు అందిస్తూ, ప్రజలందరికీ మరోసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

సైబరాబాద్ పోలీస్ మునిసిపల్ శాఖల సమన్వయం తో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

  క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం....

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి

–  బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్,డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్,పొలిటికల్...

మోజర్లలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ నాయకులకు నివాళులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

వైస్సార్ అభిమాన గణపరాపు కుటుంబం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తుమ్మల మరియు బట్టి వర్గీయలు

రావినూతలలో భూ వివాదాలపై తీవ్ర ఆరోపణలు.. మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయంటూ ఫిర్యాదుదారుల...

దళిత బహుజన నాయకులను అరెస్ట్సెప్టెంబర్ 17:  పొలిటికల్ పవర్ పిన్ 9...

Related Articles

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి

–  బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్,డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఈశ్వర్. సెప్టెంబర్. 18. 2026.బీసీ...

జిల్లాపోలీసుకార్యాలయంలోప్రజాపాలనదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి 

– పోలీసు ప్రతి రోజు ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావించాలి, పోలీసులకు, జిల్లా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టివిన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.18.2026.ప్రజల...

మోజర్లలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ నాయకులకు నివాళులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: పెద్దమందడి మండలం...
error: Content is protected !!