ePaper
Monday, September 14, 2026
📄 ePaper

విద్యార్థులు వినాయకుని నుండి ఏకాగ్రత, పట్టుదల నేర్చుకోవాలి -పలుస శంకర్ గౌడ్

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: నపర్తి తిరుమలహిల్స్ రేడియంట్ హైస్కూల్ లో వినాయక పూజలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారువిఘ్నేశ్వరుడు విద్యార్థులకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, వినాయకుడు జ్ఞానానికి ప్రతీక అన్నారు. పెద్ద చెవులు ఎక్కువ వినాలని, పెద్ద తల పెద్ద ఆలోచనలకు, చిన్న కళ్ళు సూక్ష్మ పరిశీలనకు ప్రతీక అన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ గణపతుల వల్ల కాలుష్యం అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదవాలన్నారు. చదువుతో పాటు కళలు, క్రీడల్లో రాణించాలని కోరారు.డీజేలకు దూరంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కౌసల్య భాస్కర్, దేశీ రాములు, సూపర్‌వైజర్ మలేష్, ప్రిన్సిపాల్ తిరుమలేష్, వైస్ ప్రిన్సిపాల్ రాము విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest Articles

ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల...

Related Articles

error: Content is protected !!