పొలిటికల్ పవర్ ప్రతినిధి చింతకాని
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో శ్రీ అయ్యప్ప గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర స్వామి విగ్రహం వద్ద ఈరోజు శ్రీ నల్లమోతు రాంబాబు – సునీత దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారికి అభిషేకం కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు అనంతరం స్వామివారి ఆశీస్సులు దీవెన లతో ప్రొద్దుటూరు గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారిని మనసారా వేడుకున్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదములను భక్తులు స్వీకరించి స్వామివారి సన్నిధిలో పరవశించిపోయారు దీంతో ప్రొద్దుటూరు గ్రామంలో భక్తి భావంతో పండుగ వాతావరణం నెలకొన్నది అనంతరం స్వామివారి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో స్వామివారి భక్తుల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

