ePaper
Friday, September 18, 2026
📄 ePaper

వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రంగం సిద్ధం

📰 Generate e-Paper Clip

రూ.11.75 కోట్లతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో అత్యాధునిక పాఠశాల

గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణల్లో భాగంగా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రూ.11.75 కోట్ల అంచనా వ్యయంతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో అత్యాధునిక పాఠశాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం వెల్టూరు గ్రామాన్ని సందర్శించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించి, విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రపంచస్థాయి విద్య

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన ఆధునిక విద్యా ప్రమాణాలు ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన బోధనతో పాటు క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు సమగ్ర విద్య అందించేలా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

విద్యార్థులకు రవాణా, విద్యా సామగ్రి విద్యార్థులు పాఠశాలకు సులభంగా చేరుకునేలా ప్రత్యేక బస్సుల ద్వారా రవాణా సౌకర్యం కల్పించే విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కో విద్యార్థికి సుమారు రూ.1,400 విలువైన కిట్ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు.

ఉపాధ్యాయులకు అంతర్జాతీయ విద్యా విధానాలపై అవగాహన

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విదేశీ విద్యా వ్యవస్థలు, బోధనా పద్ధతులు, సాంకేతిక వినియోగం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యక్ష అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో అమలవుతున్న ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన, ఆధునిక మౌలిక వసతులు, రవాణా సౌకర్యం, విద్యా సామగ్రి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి విద్యార్థులతో మాట్లాడి, వారితో సెల్ఫీలు దిగుతూ కొంతసేపు ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన కలిసిమెలిసి ఉండటం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువకులు, పెద్దలు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి ...

పొలిటికల్  పవర్   కథనం:   వాట్సాప్ గ్రూప్‌లలో 'కంటెంట్ కన్‌ఫ్యూజన్'.. ఎక్కడ ఏం...

ప్రత్యేక పూజలో పాల్గొన్న నల్లమోతు కుటుంబం

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  చింతకానిశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా...

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ పలుస శ్రీనివాస్...

Related Articles

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

ప్రతి ఓటు ఎంతో ముఖ్యం..  BLA-2లదే ప్రధాన భూమిక

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు SIR ప్రక్రియపై అప్రమత్తంగా పనిచేయాలి నిర్లక్ష్యానికి తావివ్వొద్దు..  చిన్న తప్పిదాలు కూడా సరిచేయాలి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి...

నంది హిల్స్ గణపయ్యకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: నంది హిల్స్‌లోని పార్కులో ఏర్పాటు చేసిన మండపంలోని వినాయక...
error: Content is protected !!