ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు ఆరుతడి పంటలు...

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

– రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,
–  జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తున్నాయి, ఎంత వదులుతున్నామనే విషయాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది, రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 13.2026.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ఆరుతడి పంటలకే వెళ్లే విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో  నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు సాగు నీరు అందించేందుకు గల అవకాశాలపై ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్,వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు.ఎల్,నినోకారణంగా కరువు పరిస్థితులు, ఉమ్మడి జిల్లాపరిధిలోనిజూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, కే ఎల్ ఐ,
బీమాతదితరప్రాజెక్టుల్లోప్రస్తుతనీటిమట్టం రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాలకు సంబంధించి నీటి నిల్వలపైనీటిపారుదలశాఖ,వ్యవసాయఅధికారులతో కలిసి మంత్రులు చర్చించారు. అదేవిధంగా  రాబోయే రోజుల్లో రైతులకుసాగునీటివిడుదలకుసంబంధించిన సాధ్యసాధ్యాల పైన కూడా చర్చించి పలు సూచనలు చేశారు. నీటిపారుదలశాఖఅధికారులుమాట్లాడుతూ ప్రస్తుతం ఎగువన ఉన్న ప్రాంతాల్లో వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడి నుంచి వరద రావడం వల్ల ప్రస్తుతానికి మన వద్ద ఉన్న ప్రాజెక్టులు నింపుకోవడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి అనగా ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితేనే మనం రైతులకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వివరించారు. అక్కడి నుంచి నీటి ప్రవాహం రాకపోతే సాగు కోసం నీరు విడుదల చేయడానికి అవకాశం ఉండదని తెలిపారు. ప్రస్తుతానికి ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపివేయడం జరిగిందని తెలిపారు.అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎల్ నినో కారణంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడిన విషయం వాస్తవం అని తెలిపారు. అదృష్టవశాత్తు కర్ణాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాల వల్ల అక్కడ నుంచి జూరాలకు వరద వచ్చిందని తెలిపారు. కానీ వర్షాకాలం పంటలు పండాలంటే డిసెంబర్ వరకు నీరు ఉండాలనీ, అప్పటివరకు నీరు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరి,వర్షాలుకురువకపోతేఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని  వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సాహం కల్పించాలన్నారు. నీటికి సంబంధించి ప్రస్తుతం ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వరి పంటకు పోకుండావారికిఅవగాహనకల్పించాలనితెలియజేశారు.ఎగువప్రాంతాలనుంచినీటిప్రవాహంవచ్చినప్పుడు రైతులకు తగినంత సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇన్ఫ్లో తగ్గిపోతే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రైతులకు ఆరుతడి పంటలువేసుకునే విధంగా పూర్తిస్థాయిలో ప్రచారకార్యక్రమాలునిర్వహించి,అవగాహనకల్పించాలనిఆదేశించారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9టీఎంసీలు కాగా, గతంలో రీజెనెరేటెడ్ నీటి సౌకర్యం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆరా తీసి దానిపై పూర్తి డేటాను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించారు. రైతులకు మినుము, వేరుశనగ, ఆయిల్ పామ్ పంటలపై పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి, అవగాహన కల్పించాలన్నారు.తదనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తున్నాయి, ఎంత వదులుతున్నామనే విషయాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అధికారులు జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలను, వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులకు మనం ఏమి ఇవ్వగలము అదే చెప్పాలని వివరించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ కే ఎల్ ఐ ద్వారా శ్రీశైలం నీటిని వనపర్తి పరిధిలో రైతులకుసాగునీరుఇవ్వడానికిఉన్నసాధ్యాసాధ్యాలపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారానార్లాపూర్, ఏదుల,వట్టెంరిజర్వాయర్లనునింపేవిధంగాచర్యలుతీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కొంత సహకరించి రైతులకు నీటిని విడుదల చేస్తే ఇప్పటికే వరి వేసుకున్న వాళ్ళు బయటపడేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. అదేవిధంగా కొత్తకోట మండల పరిధిలో ఉన్న శంకర సముద్రాన్ని కూడానింపేందుకుచర్యలుతీసుకోవాలనిసూచించారు.గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి  రైతులకు ఆన్ అండ్ ఆఫ్  పద్ధతిలో వారానికి మూడురోజులునీటివిడుదలకుచర్యలుతీసుకోవాలని సూచించారు. రాబోయే కొద్ది రోజులపాటు వానాకాలం సీజన్ పంటల కోసం జూరాల కుడి ప్రధాన కాలువ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని పాటించిరైతులకునీళ్లుఇవ్వాలనిసూచించారు.తదనంతరం దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది రైతులు ఇప్పటికే బోర్లను ఆధారంగా చేసుకొని వరి పంటకు ముందుకు వెళ్లారని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయడం ద్వారా కనీసం బోర్లు రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఎల్ నినో కమిటీ సిఫారసు చేసిన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కూరగాయల సాగు ఆరుతడి పంటల సాగు పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రాజెక్టుల్లో రిపేరుకు గురైన మోటర్లను అధికారులు బాధ్యతగా వాటినిబాగుచేయించేఏర్పాటుచేయాలని, తద్వారా కోయిల్ సాగర్ కు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలనిసూచించారు. ఇక కొత్తకోట మండలం కానాయపల్లిఆర్,అండ్,ఆర్,సమస్యనుపరిష్కరిస్తే12గ్రామాలకుపూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని దీనిపై కేబినెట్లో చర్చించాలని జిల్లా మంత్రులకు కోరారు. అచ్చంపేటశాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులకు నీటి విడుదలపైస్పష్టమైనసమాచారంతెలియజేయాలని సూచించారు. రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఒకవేళ ఇప్పటికే వరి పంట ఎవరైనా వేసుకుంటే వారు నష్టపోకుండా ఎంత వీలైతే అంత నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరంవనపర్తి జిల్లా కలెక్టర్,ఆదర్శ్,సురభిమాట్లాడుతూప్రస్తుతపరిస్థితుల్లో కాలువల్లోకి ఒకసారి సాగునీటిని విడుదల చేసిన వెంటనే రైతులు వరి నాట్లు వేసే అవకాశం ఉందని,అయితేభవిష్యత్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని వ్యవసాయఅధికారులకుసూచించారు.నీటిలభ్యతపైవాస్తవపరిస్థితులనురైతులకుముందుగానేతెలియజేయాలని, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల్లో నీటి లభ్యతను పరిగణనలోకితీసుకునిపంటలప్రణాళికను రూపొందించుకునేలా రైతులను చైతన్యపరచాలని తెలిపారు. ముఖ్యంగా అధిక నీటి అవసరం ఉన్న వరిసాగుకుప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగలఆరుతడిపంటలసాగునుప్రోత్సహించాల్సిన అవసరంఉందనికలెక్టర్,పేర్కొన్నారు.ఈసమావేశంలో నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్  కుష్బూ గుప్త, నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, గద్వాల జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హిమంత కేశవ్ పాటిల్,  ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!