ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిబడిబాట కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

బడిబాట కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

📰 Generate e-Paper Clip

మద్దిగట్ల గ్రామపంచాయతీ సమావేశంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు పిలుపు

 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 జూన్ 2026: పెద్దమందడి మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్ల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు గురువారం మద్దిగట్ల గ్రామపంచాయతీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మద్దిగట్ల గ్రామపంచాయతీ పరిధిలోని బడి ఈడు గల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత నోటు పుస్తకాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతులు, వ్యాయామ విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, కుట్టు శిక్షణ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా మద్దిగట్ల–మోజర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో శాతం వంద ఉత్తీర్ణత సాధించడం పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని తెలిపారు. అలాగే పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారించాలని కోరుతూ, పాఠశాలకు సుమారు 500 మీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణం అవసరమని గ్రామపంచాయతీ సమావేశంలో ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, ఉపసర్పంచ్ రవి, ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. వెంకటస్వామి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజు, ఉపాధ్యాయులు విష్ణు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు బుచ్చిలింగం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!