ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిబదిలీ సరే... చర్యల సంగతేంటి ?

బదిలీ సరే… చర్యల సంగతేంటి ?

📰 Generate e-Paper Clip

– ధాన్యం మాయంపై డీఎస్ఓను శిక్షించాల్సిందే,
కంటితుడుపుచర్యలతోచేతులుదులుపుకుంటున్న అధికారులు,
– అవినీతికిపాల్పడితేఎంతటివారినైనాఉపేక్షించం,
అవినీతిపై బీసీ పొలిటికల్ జేఏసీ సాధించిన మరో విజయమే డీఎస్ఓ బదిలీ,
–  బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29. 2026.
వనపర్తి జిల్లాలో రూ. కోట్ల ధాన్యం మాయం కావడానికి ప్రధాన కారకుడైన డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ ను బదిలీతో సరి పెడితే సరిపోదని, అతనిని కఠినంగా శిక్షించాల్సిందేనని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
మాట్లాడుతూఎంతోస్వేచ్ఛాయుతవాతావరణంలో కొనసాగే జిల్లాను డీఎస్ఓ కాశి విశ్వనాధ్ వచ్చిన తర్వాతేజిల్లాకుఅవినీతిమరకలుఅంటుకున్నాయని, ధాన్యం కొనుగోలు, ధాన్యం కేటాయింపులు వంటి అనేక కార్యక్రమాలలో డిఎస్ఓకాశీవిశ్వనాథ్ అవినీతిఅక్రమాలకుపాల్పడ్డాడనితెలిపారు.వందల కోట్ల ప్రజాధనాన్ని అక్రమార్కులకు అప్పనంగా కట్టబెట్టడంతో పాటు కాసులకు కక్కుర్తి పడి కోట్ల రూపాయలను దోచుకున్నాడని మండిపడ్డారు.
డీఎస్ఓ అవినీతి అక్రమాలపై బీసీ పొలిటికల్ జేఏసీరాజిలేనిపోరాటంకొనసాగించిందని,ఎట్టకేలకు స్పందించిన అధికారులు కంటితుడుపు చర్యగా అతనినికమిషనరేటుకుఅటాచ్,చేయడంతోచేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. కేవలం బదిలీతో సరిపెట్టకుండా కోట్లరూపాయలఅవినీతికి పాల్పడ్డ అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని, లేదంటే తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. జిల్లాలో ఏ ఒక్క అధికారి అవినీతికి పాల్పడిన బీసీపొలిటికల్ జేఏసీ సహించబోదని,అవినీతిఅధికారులగుండెల్లో నిద్రపోతామని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు సైతంఅవినీతి,అక్రమాలకుపాల్పడుతున్నట్లుతమదృష్టికివచ్చిందని అలాంటి వారిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.డిఎస్ఓ  బదిలీతో బీసీ పొలిటికల్ జేఏసీపై మరింత బాధ్యత పెరిగిందని, తమకు వెన్నంటే ఉంటూ సహకరిస్తున్న జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!