ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు.. పరస్పర విమర్శలు!

📰 Generate e-Paper Clip

పార్టీకి రాజీనామా చేసిన వారు ఇప్పుడు కార్యకర్తలమంటూ మాట్లాడటం విడ్డూరం: జుజ్జురపు వెంకన్నబాబు

అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, మేడపురెడ్డి నాగార్జున : అశ్వారావుపేట మండల బీఆర్‌ఎస్ పార్టీలో గ్రామ కమిటీల నియామకం, పార్టీ కార్యక్రమాల నిర్వహణపై అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అశ్వారావుపేట మండల మాజీ అధ్యక్షుడు జుజ్జురపు వెంకన్నబాబు వివరణ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసిన వారు, పార్టీ కష్టకాలంలో అండగా నిలవకుండా ఇప్పుడు పార్టీ కార్యకర్తలమంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించినప్పటికీ, వారు ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదని ఆరోపించారు.
పార్టీ జిల్లా ఇన్‌చార్జి, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాలకు అనుగుణంగా తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే కొందరు నాయకులు పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని రెండు వర్గాలుగా విభజించారని ఆరోపించారు.

తిరుమలకుంట గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ శాఖ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ విషయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి లేదా మండల కోఆర్డినేటర్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో మూడుసార్లు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం పొందినప్పటికీ, గ్రామంలో పార్టీని వర్గాలుగా విభజించారని కొందరు నాయకులపై విమర్శలు చేశారు.

కొత్తగూడెంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలోనూ కొందరు నాయకులు కావాలనే వివాదం సృష్టించి సమావేశానికి అంతరాయం కలిగించారని ఆరోపించారు. పార్టీ అంతర్గత సమస్యలను బయటకు తీసుకెళ్లి సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందన్నారు.

సోషల్ మీడియాలో టీమ్ పేర్లతో ప్రచారం చేయడం కూడా పార్టీకి నష్టం కలిగించిందని పేర్కొన్నారు. తాము ఎవరినీ పార్టీ నుంచి తొలగిస్తామని ఎక్కడా ప్రకటించలేదని, సభ్యత్వాల విషయంలోనూ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

పార్టీ అనేది ఒక్కరిది కాదని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే బలోపేతం అవుతుందని వెంకన్నబాబు పేర్కొన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని కోరారు.

Latest Articles

ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

అల్వాల గ్రామంలో రెండో విడత లబ్ధిదారుల వెరిఫికేషన్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇందిరమ్మ హౌసింగ్...

అల్వాలలో 30 మంది రైతుల పంట నష్టం పరిశీలన

ఎంఏఓ సైదులు యాదవ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏఈఓ సురేష్ కుమార్ ఎల్‌నినో...

Related Articles

సమాఖ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే జారె వినతి

CBO HR పాలసీ అమలు చేయాలని PR & RD కమిషనర్‌కు విజ్ఞప్తిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: తెలంగాణ రాష్ట్రంలోని మండల, జిల్లా సమాఖ్యల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల...

ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!

దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపుపొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలను కాపాడిన దమ్మపేటకు చెందిన ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి....

ముత్యాలమ్మ ఆలయానికి విరాళం.. ఆదివాసీ గ్రామాల రహదారిపై గళమెత్తిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 11:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ...
error: Content is protected !!