పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని, గ్రామం పాడిపంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మన్నెపురెడ్డి, మండపం నిర్వాహకులు పూజేశ్వర్ గౌడ్, మహేష్, భజన మండలి సభ్యులు లక్ష్మణ్ గౌడ్, రాకాసి యాదవ్ రెడ్డి, ప్రవీణ్ శెట్టి, కిరణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

