ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన ఏఎస్సై కుటుంబానికి విడో కార్పస్ ఫండ్ ద్వారా లక్ష చెక్ ను అందజేసిన జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

– చనిపోయిన పోలీసు కుటుంబాలకు అన్ని వేళలా అండగా నిలుస్తాం,

 జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి ఐపీఎస్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11.2026: పోలీసు కార్పస్ విడో ఫండ్ పోలీసు కుటుంబాలలో ఆర్థిక భరోసా కల్పిస్తూ, సంక్షేమానికి కొత్త వెలుగులు నింపుతోందని వనపర్తి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో, జనవరిలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా వనపర్తి జిల్లా పానుగల్ పోలీస్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తు మరణించిన రాందాస్ భార్య లావణ్యకు జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ పోలీసు విడో కార్పస్ ఫండ్ కింద రూ. లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారా వారికి అందాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరణించిన పోలీసు కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకుని, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను ఆరా తీశారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాల సంక్షేమం పోలీసుశాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తూ, వారికి నిరంతరం సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ కూడా త్వరితగతిన అందేలా కృషి చేయాలని కార్యాలయ ఏ.ఓ. కీ జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏ.ఓ. సునందన, సూపరింటెండెంట్ ఇంతియాజ్, మరణించిన ఏఎస్సై, రాందాస్ భార్య లావణ్య, కూతురు నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!