ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపభారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర..

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని క కలసపాడు మండలం లో సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పాదయాత్రలో భాగంగ బలిజ పల్లె, మరియు చింతలపల్లె, శంకవరం, గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి గుడిమె. సునీల్ కుమార్. సహాయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ. చింతల పల్లెలో స్మశానానికి దారి లేక, దహన సంస్కారాలు చేసుకోవాలంటే ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతుందన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను గుర్తించి ఈ సమస్యను పరిష్కరించాలని వాళ్ళ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ప్రజలకు అన్ని చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదు. ఈ గ్రామంలో అనేకమంది భూమి లేని నిరుపేదలు ఉన్నప్పటికీ.. దశల వారిగా ఎమ్మార్వో గారికి అర్జీలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఏ ఒక్కరికి భూమి ఇవ్వలేదు…. 2004లో అసైన్మెంట్ కమిటీ జరిగితే.. అప్పటినుండి ఇప్పటివరకు ఒక అసైన్మెంట్ కమిటీ కూడా వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.22 సంవత్సరాలుగా భూమి లేని నిరుపేదలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా కు నోచుకోక కాయ కష్టం చేసుకుని బతుకుతున్నారు.. మేము అధికారం లోకి వస్తే ఎస్సీ. బీసీ. మైనారిటీ.సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఏ ఒక్క రుణం ఇయ్యకపోవడం బాధాకరమన్నారుఅలాగే సబ్సిడీ రుణాలు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గానికి ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ నాయకులు చిన్నప్ప. ఆదిలక్ష్మి. గురు స్వామి. రంగయ్య. రంగలీల.. మా లక్ష్మమ్మ. నిర్మల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!