ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

భారీ గాలివానతో 21వ వార్డులో నష్టం 

📰 Generate e-Paper Clip

–వెంటనే స్పందించిన ద్యారపోగు వెంకటేష్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో నిన్న సాయంత్రం కురిసిన భారీ గాలివాన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా 21వ వార్డు ఎస్సీ కాలనీలో పలు ఇబ్బందికరపరిస్థితులు ఏర్పడ్డాయి.ఇండ్ల మధ్యలో ఉన్న భారీ చెట్లు విరిగిపడి ద్యారపోగు చిన్న గట్టయ్య ఇంటిపై పడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ద్యారపోగు పెద్దగట్టయ్య కుమారుడు మోహన్ స్థానికంగా సేవలందిస్తున్న వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంకటేష్ కు తెలియజేయగా, ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విరిగిపడిన భారీ చెట్టు, ఆగిపోయిన అండర్ డ్రైనేజీ కాలువను పరిశీలించి వెంటనే మున్సిపల్ కమిషనర్ కు సమాచారం అందించారు.దీనిపై తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని పంపించి మిషనరీ సహాయంతో విరిగిపడిన భారీ చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. అలాగే భారీ గాలుల ప్రభావంతో కాకులోరం నారాయణ ఇంటి కప్పు రేకులు విరిగిపోవడంతో ద్యారపోగు వెంకటేష్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 21వ వార్డులో అండర్ డ్రైనేజీ జామ్ కావడం వల్ల దుర్వాసన వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కమిషనర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి

–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు...

ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య..

రైతులకు మెరుగైన మార్కెట్‌ సేవలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెబ్బేరులో నూతన భవిత...
error: Content is protected !!