పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 08 2026: వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆయన చాంబర్‌లో కలిసి పలు కీలక అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల నివేదికలను సమర్పించారు. వనపర్తి నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు, బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మొత్తం నాలుగు బీసీ సంక్షేమ విద్యాసంస్థల నూతన భవనాలు, అలాగే శాస్త్రీయ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌తో కూడిన జిల్లా రవాణా కార్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో శాస్త్రీయ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌తో కూడిన జిల్లా రవాణా కార్యాలయ నూతన భవనం, చిట్యాల, (వనపర్తి) ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలుర) నూతన భవనం కడుకుంట్లలో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల (బాలుర) నూతన భవనం, పెబ్బేరులో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల (బాలికల) నూతన భవనం వెల్టూరులో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల (బాలికల) నూతన భవనాలు ఉన్నాయి. వనపర్తి జిల్లాకు అవసరమైన రవాణా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు, బీసీ విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు అందించేందుకు ఈ భవనాల నిర్మాణం ఎంతో అవసరమని మంత్రి కి వివరించారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య, ప్రస్తుత వసతులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన భవనాలను మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఈ ప్రతిపాదనలను పరిశీలించి, ఆయా శాఖల పరిధిలో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే వీటికి మంజూరీలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పట్ల సానుకూలంగా స్పందింన మంత్రి కి ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
