ePaper
Sunday, August 30, 2026
📄 ePaper
Homeతెలంగాణఆసిఫాబాద్మాట చెప్పగానే స్పందించి రోడ్డు గుంతలకు మరమ్మతులు చేపట్టిన -ఉప సర్పంచ్ ముండే దీపక్

మాట చెప్పగానే స్పందించి రోడ్డు గుంతలకు మరమ్మతులు చేపట్టిన -ఉప సర్పంచ్ ముండే దీపక్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి: మండల కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఎంట్రన్స్‌ వద్ద గత కొంతకాలంగా ఏర్పడిన పెద్ద గుంతలతో కాలనీవాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన టీం త్రిశూల్ సభ్యులు వెంటనే వాంకిడి ఉప సర్పంచ్ ముండే దీపక్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే ఉప సర్పంచ్ దీపక్ ముండే స్పందించి లక్ష్మీనగర్‌కు చేరుకున్నారు. NHAI అధికారులతో మాట్లాడి రహదారి మరమ్మతు పనులను ప్రారంభించడంతో పాటు, పనులు పూర్తయ్యే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. NHAI సహకారంతో రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి డాంబర్‌ వేయడంతో కాలనీవాసులు, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగాయి. సమస్యను తమ దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టిన ఉప సర్పంచ్ దీపక్ ముండేకు స్థానికులు, టీం త్రిశూల్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాడే తిరుపతితో పాటు టీం త్రిశూల్ సభ్యులు నాగ, రాజు, వనేష్, శివ, పవన్, ఆకాష్, శ్యామ్, విశాల్, ప్రణీత్, సన్నీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Previous article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!