-పలుస శంకర్ గౌడ్, గద్దె భాస్కర్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: వనపర్తి జిల్లాలోని స్థానిక ప్రైవేట్ పాఠశాలలో రక్షా బంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మరియు పరావస్తు సొసైటీ స్టేట్ కో-ఆర్డినేటర్ గద్దె భాస్కర్ మాట్లాడుతూ… రక్షా బంధన్ అనేది స్నేహం, సమైక్యత, రక్షణకు చిహ్నమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, స్నేహభావం పెంపొందించేందుకు ఇటువంటి వేడుకలు అవసరమని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సమానత్వం, సహకార భావాన్ని చాటారు. కార్యక్రమంలో రాఖీల పంపిణీ నిర్వహించి పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో విజయవంతంగా ముగిసింది.

