పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపెల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2 వ తేదీ ఆదివారం రోజున ఎన్టిపిసి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పెద్దపల్లి పట్టణంలోని రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి గౌస్ పాషా అండర్ 6 విభాగంలో 60 మీటర్లు, 150 మీటర్లు మరియు స్టాండింగ్ జంప్ పోటీలలో బంగారు, కాంస్య మరియు కాంస్య పథకాలు సాధించి ఛాంపియన్ గా నిలిచి ఈనెల 7వ తేదీన హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తగురం తిరుపతి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సయీద్ అహ్మద్ మరియు ప్రధానోపాధ్యాయులు హకీమ్ ఖాన్ విద్యార్థిని అభినందించారు.
