ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరేవల్లిలో ఘనంగా మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవం

రేవల్లిలో ఘనంగా మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: రేవల్లి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 7 2026న రేవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ఉపాధ్యాయ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. మండల ఉపాధ్యాయ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సన్మానించారు. తొలుత ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. 1. లియోనా – ఎస్‌జీటీ, ప్రాథమిక పాఠశాల, నాగపూర్. 2. అంబాశంకర్ – పాఠశాల సహాయకులు (ఆంగ్లం), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాగపూర్. 3. కే. దశరథ్– పాఠశాల సహాయకులు (తెలుగు), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రేవల్లి. 4. మహాలక్ష్మి – పాఠశాల సహాయకులు (సాంఘిక శాస్త్రం), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బండరావిపాకుల. 5. ఎస్. చంద్రకాంత్ – పాఠశాల సహాయకులు (హిందీ), మండల పరిషత్ ఉన్నత పాఠశాల, తలుపునూరు. 6. ఏ. సరస్వతి – సీఆర్‌టీ (హిందీ), కేజీబీవీ, రేవల్లి. 7. టి. వెంకటమ్మ – ఎస్‌జీటీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గొల్లపల్లి. 8. ఎస్. కృష్ణయ్య – ఎస్‌జీటీ, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కేశంపేట. 9. పి. శ్రీశైలం – ఎస్‌జీటీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గొల్లపల్లి. 10. కే. శిరీష – ఎస్‌జీటీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, రేవల్లి. 11. బి. రాముడు – ఎస్‌జీటీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కొంకలపల్లి. 12. ఆర్. శ్రీకాంత్ – ఎస్‌జీటీ, ప్రాథమిక పాఠశాల, గౌరీదేవిపల్లి. అనంతరం మండల ఉపాధ్యాయ సంక్షేమ సంస్థ సూచన మేరకు మరో ముగ్గురు ఉపాధ్యాయులను కూడా మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. 13. ఎస్. ఆంజనేయులు – ఎస్‌జీటీ, ప్రాథమిక పాఠశాల, నాగపూర్. 14. పి. అనురాధ – ఎస్‌జీటీ, ప్రాథమిక పాఠశాల, రేవల్లి. 15. కాంత – సీఆర్‌టీ (గణితం), కేజీబీవీ, రేవల్లి. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ మండల విద్యాశాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, నాణ్యమైన విద్యాబోధనకు ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కుమారి కీర్తన, మండల విద్యాధికారి ఎస్. వరప్రసాద్ రావు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాద్, జిల్లా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అధ్యక్షులు రామమూర్తి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం ఉపాధ్యాయుల్లో మరింత ప్రోత్సాహాన్ని, బాధ్యతను పెంపొందిస్తుందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!