ePaper
Friday, September 18, 2026
📄 ePaper

రైతులకు సౌకర్యాలు కల్పించకుండానే మార్కెట్ యార్డ్ పదవుల పంచకం సిగ్గుచేటు

📰 Generate e-Paper Clip

-అల్వాల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: పెద్దమందడి, ఖిల్లా ఘనపూర్ మండలాల్లో నూతన మార్కెట్ యార్డు భవనాలు నిర్మించకుండానే పదవులను పంచుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు అల్వాల వెంకట్ రెడ్డి విమర్శించారు. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం నాయకులకు పదవులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ యార్డు భవనాలకు పరిపాలనా అనుమతులు (ప్రొసీడింగ్స్) మంజూరయ్యాయని చెబుతున్నప్పటికీ, భవన నిర్మాణాలు పూర్తి కాకముందే, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకముందే పదవులను తీసుకోవడం సరైంది కాదని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్ యార్డులు రైతులకు ఉపయోగపడే విధంగా ముందుగా భవనాలు నిర్మించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు సరైన వసతులు లేకపోయినా, కేవలం రాజకీయ నాయకులకు పదవులు పంచడం దురదృష్టకరమని విమర్శించారు.మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం అంటే రైతులకు సేవలు అందించడమే గానీ, రాజకీయ ప్రయోజనాల కోసం పదవుల పంపిణీ చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి పదవుల పంచకానికి ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమని, ముందుగా మార్కెట్ యార్డు భవనాలు నిర్మించి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే పదవుల నియామకాలు చేపట్టాలని అల్వాల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్...

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి -డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని బీసీ...

పామిరెడ్డిపల్లిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

స్వచ్ఛతా హి సేవపై విద్యార్థులకు అవగాహనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని...
error: Content is protected !!