పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25 2026: పెబ్బేరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవి నాయక్ ఆహ్వానం మేరకు వనపర్తి మండలం నాచహళ్ళి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్ను ప్రారంభించిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
