ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

రోడ్డు మంజూరైనా తీరని తిప్పలు.. అధికారుల అలసత్వంతో ‘చర్లపల్లి’ ప్రజల అవస్థలు! — బీటీ రోడ్డు మంజూరై 7 నెలలైనా ప్రారంభంకాని పనులు — పంట పొలాలకు, విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు — తక్షణమే పనులు ప్రారంభించి రోడ్డు వేయాలని గ్రామస్థుల డిమాండ్

📰 Generate e-Paper Clip

టేకులపల్లి (పొలిటికల్ పవర్ – పీఎన్ 9 న్యూస్ / కాకటి సత్యప్రసాద్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మేళ్లమడుగు పంచాయతీ చర్లపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామస్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరై ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా చర్లపల్లి 8వ వార్డు నివాసి మరియు గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామానికి రోడ్డు మంజూరై ఏడు నెలలు కావస్తున్నా, పనులు ప్రారంభించడంలో పాలకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాకపోకలకు సరైన దారి లేక రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి, వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, విద్యార్థులు నిత్యం గుంతల రోడ్డుపై ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ప్రజాప్రతినిధులు, సంబంధిత కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి, మంజూరైన బీటీ రోడ్డు పనులను వెంటనే పూర్తిచేసి తమ రవాణా కష్టాల నుండి విముక్తి కల్పించాలని చర్లపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

దండేపల్లి ఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్...

కరువుతో రైతులు కన్నీరు మున్నీరు.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు,పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

దండేపల్లి ఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్దండేపల్లి మండల ఆర్‌ఎంపీ–పీఎంపీ సంఘం అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ . ప్రధాన...

శేరిపురం రైతు వేదికలో ఘనంగా వ్యవసాయ అవగాహన సదస్సు — రసాయనాలు తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి: ఏవో కావటి రామారావు — జీవామృతం, ఘనజీవామృతం తయారీపై...

గార్ల (పొలిటికల్ పవర్ - మాలోత్ అజయ్ నాయక్):గార్ల మండల పరిధిలోని శేరిపురం గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ప్రత్యేక వ్యవసాయ అవగాహన...

కీర్తిశేషులు దమ్మాలపాటి దేశపతిరావు, రోసమ్మల స్మారకార్థం అన్నదాన కార్యక్రమం — హర్ష కేతన్ స్వచ్ఛంద సేవా ఫౌండేషన్‌లో అన్నప్రసాద వితరణ — పేదలకు అన్నం పెట్టడం కన్నా గొప్ప సేవ...

ఖమ్మం (పొలిటికల్ పవర్ - ఎన్ వి ఆర్ టీవీ న్యూస్):ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, స్వాతంత్ర్య సమరయోధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు దమ్మాలపాటి...
error: Content is protected !!