ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

శేరిపురం రైతు వేదికలో ఘనంగా వ్యవసాయ అవగాహన సదస్సు — రసాయనాలు తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి: ఏవో కావటి రామారావు — జీవామృతం, ఘనజీవామృతం తయారీపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ

📰 Generate e-Paper Clip

గార్ల (పొలిటికల్ పవర్ – మాలోత్ అజయ్ నాయక్):

గార్ల మండల పరిధిలోని శేరిపురం గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ప్రత్యేక వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గుగులోత్ భారతి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి (ఏవో) కావటి రామారావు హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెరగడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క రైతు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం వంటి సేంద్రియ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు.

అనంతరం వ్యవసాయ అధికారులు రైతులకు జీవామృతం, ఘనజీవామృతం తయారీ విధానం, పంటలపై పిచికారీ చేసే పద్ధతులు మరియు వాటి వినియోగంపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) రాజ్యలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ భరత్, గ్రామ ఉప సర్పంచ్, వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Latest Articles

దండేపల్లి ఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్...

కరువుతో రైతులు కన్నీరు మున్నీరు.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు,పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

దండేపల్లి ఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్దండేపల్లి మండల ఆర్‌ఎంపీ–పీఎంపీ సంఘం అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ . ప్రధాన...

రోడ్డు మంజూరైనా తీరని తిప్పలు.. అధికారుల అలసత్వంతో ‘చర్లపల్లి’ ప్రజల అవస్థలు! — బీటీ రోడ్డు మంజూరై 7 నెలలైనా ప్రారంభంకాని పనులు — పంట పొలాలకు, విద్యార్థుల రాకపోకలకు...

టేకులపల్లి (పొలిటికల్ పవర్ - పీఎన్ 9 న్యూస్ / కాకటి సత్యప్రసాద్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మేళ్లమడుగు పంచాయతీ చర్లపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామస్థులు...

కీర్తిశేషులు దమ్మాలపాటి దేశపతిరావు, రోసమ్మల స్మారకార్థం అన్నదాన కార్యక్రమం — హర్ష కేతన్ స్వచ్ఛంద సేవా ఫౌండేషన్‌లో అన్నప్రసాద వితరణ — పేదలకు అన్నం పెట్టడం కన్నా గొప్ప సేవ...

ఖమ్మం (పొలిటికల్ పవర్ - ఎన్ వి ఆర్ టీవీ న్యూస్):ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, స్వాతంత్ర్య సమరయోధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు దమ్మాలపాటి...
error: Content is protected !!