ePaper
Thursday, September 3, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ పాండు నాయక్‌..

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ పాండు నాయక్‌..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 03 2026: హైదరాబాద్‌ నగరంలోని గోల్కొండ జోన్‌ పరిధి టోలిచౌక్‌ ఎస్ఐ పాండు నాయక్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులకు ఎస్ఐను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని, అదేవిధంగా పాస్‌పోర్టును సీజ్‌ చేయవద్దని ఎస్ఐ పాండు నాయక్‌ను కోరగా అందుకు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించగా వారి సూచనల మేరకు నగదు అందిస్తుండగా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!