ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివనపర్తి పట్టణ కేంద్రం లో నూతన ప్రవేట్ స్కూల్ ను ప్రారంభించిన

వనపర్తి పట్టణ కేంద్రం లో నూతన ప్రవేట్ స్కూల్ ను ప్రారంభించిన

📰 Generate e-Paper Clip

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 08 2026: వనపర్తి పట్టణ కేంద్రం 6 వ వార్డులో నూతన ప్రవేట్ వశిష్ట స్కూల్ ను యజమాన్యం పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై స్కూల్ ను ప్రారంభించారు.డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… విద్య అనేది సమాజ అభివృద్ధికి పునాది వంటిది అని అన్నారు. మంచి విద్యతోనే దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులను తయారు చేయగలం అని అన్నారు. వశిష్ట పాఠశాల ఈ ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. ఆధునిక విద్యతో పాటు నైతిక విలువలను కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించాలి అని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, బాధ్యత మరియు సేవాభావాన్ని అలవర్చుకునే వాతావరణాన్ని కల్పించాలని అని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించే విధంగా పాఠశాల యజమాన్యం శ్రద్ధ చూపించాలి అని అన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి అని అన్నారు. వశిష్ట ప్రైవేట్ స్కూల్ విద్యా రంగంలో చిరస్థాయిగా నిలిచే సంస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న అని అన్నారు. వశిష్ట పాఠశాల నుంచి భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు మరియు నాయకులు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. వశిష్ట పాఠశాల యజమాన్యాన్ని చిన్నారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి 6 వ వార్డు కౌన్సిలర్ పీతంబర్ నాయక్, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నారాయణ, సీనియర్ నాయకులు రామ్ జి నాయక్, సిరివాటి సురేష్, బాల్ రాజు, చెన్నయ్య, ఆంజనేయులు, నాగ రాజు, వంశీ, పూల్యా నాయక్, గోపాల్, శేఖర్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!