ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

వరద నీటిలో పేదల బతుకులు.. లచ్చాపురం ఎస్సీ కాలనీపై పాలకుల దృష్టి ఎప్పుడు?

📰 Generate e-Paper Clip

పాలకులు మారుతున్నా.. పేదల బతుకులు మారవా?

లచ్చాపురం ఎస్సీ కాలనీలో వరద నీటిలో మునిగిన ఇళ్లు.. నిలువ నీడ కోసం బాధితుల ఎదురుచూపులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: భారీ వర్షాలు కురిస్తే చాలు.. పేదల ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. రేకుల షెడ్లు, గుడిసెల్లో జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాల బతుకులు ప్రతి వర్షాకాలంలో నీటిపాలవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో కనిపిస్తున్న దృశ్యాలు పేదల దుస్థితికి అద్దం పడుతున్నాయి

భారీ వర్షాల కారణంగా కాలనీలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఇళ్లలోని వస్తువులు తడిసిపోయి రోజువారీ జీవనం అస్తవ్యస్తమైంది. సొంత ఇళ్లు లేక రేకుల షెడ్లు, గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలకు వర్షాలు మరింత కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.

పాలకులు మారుతున్నా.. పేదలకు శాశ్వత పరిష్కారం ఎక్కడ?

ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ పేదల తలదాచుకునే గూడు సమస్య మాత్రం ఎందుకు పరిష్కారం కావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీలు ఇస్తున్న పాలకులు, క్షేత్రస్థాయిలో ఇలాంటి కుటుంబాల పరిస్థితిని ఎప్పుడు పరిశీలిస్తారని నిలదీస్తున్నారు.

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించాలి

లచ్చాపురం ఎస్సీ కాలనీలో వరద నీటితో ఇబ్బందులు పడుతున్న కుటుంబాల పరిస్థితిని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వెంటనే పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. ముందుగా వరద నీరు తొలగించి, అవసరమైన తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, కాలనీలో వరద నీరు నిల్వ ఉండకుండా శాశ్వత డ్రైనేజీ, నీటి పారుదల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

లచ్చాపురం ఎస్సీ కాలనీకి చెందిన పొడితోరి పండు, ఆయన భార్య నాగమణి, పిల్లలు వర్షిత్, వర్షిణి కుటుంబం కూడా ఈ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ కుటుంబంతో పాటు ఇబ్బందులు పడుతున్న ఇతర బాధితుల సమస్యలను అధికారులు, ఎమ్మెల్యే ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పేదలకు పక్కా ఇళ్లు, మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పే పాలకులు.. వర్షం వస్తే ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్న ఈ కుటుంబాలకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపిస్తారు? మరో వర్షాకాలం వచ్చే వరకు బాధితులు ఇలాగే ఇబ్బందులు పడాల్సిందేనా? ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వారికి భద్రమైన నివాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Latest Articles

నిలువ నీడ కరువు.. తుఫాన్‌ నీటిలో బుచ్చమ్మ బతుకు దుర్భరం!

వర్షపు నీటిలో మునిగిన పూరిల్లు.. విద్యుత్‌ లేదు, వంట చేసుకునే పరిస్థితి...

: అనంతపురంలో ‘రమేష్ గౌడ్’ మార్క్ హవా!

అనంతపురం / కదిరి:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

వర్షంలోనూ వెలసిన మానవత్వం: ఖమ్మంలో JSPW భారీ అన్నదానం!

 ఖమ్మం (పొలిటికల్ పవర్ - యర్ర నాగరాజు రెడ్డి):ప్రకృతి కోపించి పగబట్టినా......

తెలంగాణ లో టిడిపి పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి 

– పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు టిడిపి ప్రభుత్వం...

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

Related Articles

నిలువ నీడ కరువు.. తుఫాన్‌ నీటిలో బుచ్చమ్మ బతుకు దుర్భరం!

వర్షపు నీటిలో మునిగిన పూరిల్లు.. విద్యుత్‌ లేదు, వంట చేసుకునే పరిస్థితి లేదుపొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 4: ఒకవైపు కుండపోత వర్షాలు.. మరోవైపు ఉండటానికి సరైన ఇల్లు లేదు. కనీస వసతులు కూడా కరువై...

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున,నవంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న...

వర్షంలో ఆకలితో ఉన్నవారికి JSPW అన్నదానం

ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్లపై నిరుపేదలు, ప్రయాణికులకు ఆహారం పంపిణీ పొలిటికల్ పవర్, ఖమ్మం, నవంబర్ 3: తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం నగరంలో ప్రజలు...
error: Content is protected !!