ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవిద్యుత్ శాఖ నిర్లక్ష్యం!!

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం!!

📰 Generate e-Paper Clip

ఈదురు గాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలు 

విద్యుత్ స్తంభాలు, వైర్లు, చెట్లు 

ప్రమాదభరితంగా విద్యుత్ స్తంభాలు 

రాబోయే రోజులలో ప్రమాదాలు 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 22 2026: వర్షాకాలం రాకముందే భారీ ఈదురుగాలులు ఆకాల వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా కరెంటు సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారీ ఈదురు గాలులు ఆకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మార్కెట్ యార్డులలో పండించిన పంట నీట మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. మరోపక్క గ్రామాలలో పట్టణాలలో ప్రమాద భరితంగా విద్యుత్ వైర్లు స్తంభాలు వేలాడుతున్న కూడా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు మరమ్మతులు ఎందుకు చేపట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈదురుగాళ్లకు విద్యుత్ స్తంభాలు వైర్లు తెగిపడి ప్రాణా నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ వేసవికాలంలోనే ఈ మరమ్మతులు చేపట్టవలసిన విద్యుత్ శాఖ మొక్కుబడిగా డ్యూటీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతేకాక పట్టణాలలో గ్రామాలలో బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగులు విద్యుత్తు లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ తో పాటు, అసిస్టెంట్ ఇంజనీర్లు పల్లెల్లో కొలువులు పట్టణాల్లో నివాసాలు ఉంటూ గ్రామాలలో ఏమి తెలియని ప్రైవేట్ వర్కర్లను పెట్టుకొని స్తంభాలు ఎక్కిస్తూ అనేకమంది ప్రైవేట్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన కూడా నేటికీ విద్యుత్ శాఖలో కష్టం ఒకరిది ఫలితం మరొకరిది అన్న విధంగా ప్రైవేటు సిబ్బందితో పనులు చేయిస్తున్నారని తెలుస్తుంది. మరి కొన్నిచోట్ల విచ్చలవిడిగా డ్యూటీ చేయకుండా వ్యక్తిగత వ్యాపారం చేసుకుంటూ కరెంటు సరఫరా లో అంతరాయం ఏర్పడ్డ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన విద్యుత్ సిబ్బంది ప్రజలను బెదిరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, గద్వాల, కల్వకుర్తి, తదితర నియోజకవర్గాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో సైతం విద్యుత్ శాఖ అధికారులు కొంతమంది ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయం పైన స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు సమీక్షలు సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులను హెచ్చరించినా కూడా ఎమ్మెల్యేల మాటలు బేఖాతరు చేస్తూ విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా డ్యూటీలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన సర్పంచులు పట్టణ ప్రాంతాల్లో కౌన్సిలర్లు గా గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు అధికారుల పనితీరుపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల విద్యుత్ శాఖ అధికారులతో పాటు త్రాగునీటి సమస్యల్లో కూడా తీవ్రత అంతరాయం ఏర్పడుతుందని సంబంధిత త్రాగునీటి అధికారులపై దృష్టి పెట్టకపోవడం వేసవికాలంలో ప్రజలు తీవ్రమైన కరెంటు కోత తాగడానికి చుక్క నీరు లేక అలమటిస్తున్నారని ప్రజాప్రతినిధుల వైఫల్యం వల్లనే ఈ తతంగం జరుగుతుందని ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల ముందు హైడ్రామాలు అబద్ధాలు చెప్పి గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు కనిపించకుండా ఖద్దరు చొక్కాలు వేసుకొని కాలం గడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రమాదంగా ఉన్న విద్యుత్ స్తంభాలు వైర్లను మరమ్మతులు చేపట్టాలని విరిగిపడ్డ చెట్లు వైర్లపై పడకుండా చెట్లను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ముందు జాగ్రత్తతో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!