ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణశ్రీశైలంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీశైలంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 15, 2026: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానం దివ్య సన్నిధిలో ‘సాత్విక కూచిపూడి అకాడమీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అకాడమీ అధినేత, నృత్య గురువు సుధారాణి శిష్య బృందం సాంప్రదాయ నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండల్ రావు నృత్య ప్రదర్శనలను తిలకించి, గురుశిష్యుల ప్రతిభను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ఈ ప్రదర్శనలో కొత్తకోట, మొజర్ల, మద్దిగట్ల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నక్షత్ర, వర్షిణి తదితరులు పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భక్తి భావంతో కూడిన నృత్య రూపకాల ద్వారా ఆలయానికి విచ్చేసిన భక్తులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గట్టు వర్షిని, గట్టు శరత్, చంద్రిక, గట్టు తేజస్విని, గట్టు విదిజా, గట్టు సమీక్ష, దమయంతి, అఖిత, జ్యోత్స్న శ్రీ, లాస్య, రిషిత, హిమ వర్షిని తదితర విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని యువతలో ప్రోత్సహిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, కళా వైభవాల సమ్మేళనంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!