ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక పీస్ 9 టీవీ తెలుగు న్యూస్ శ్రీశైలం రిపోర్టర్ ఎస్ జేమ్స్,లోకకల్యాణం కోసం దేవస్థానం నేడు (03.11.2026) ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది.
ప్రతి మంగళవారం మరియు కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేషఅభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి.
కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది.
ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతివైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతుల తో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించబడింది. అనంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్ర పారాయణలు చేయబడ్డాయి.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు,పెరుగు,తేనె,నెయ్యి, కొబ్బరి నీళ్ళు మరియు వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వివిధ పండ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.

 

Latest Articles

తొమ్మిదేళ్లు దోసుకొన్న దొంగలు మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరా..

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం విలేకరుల సమావేశంలో మంత్రి...

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై...

కొబ్బరి బొండాల మాటున 08 పశువుల అక్రమ రవాణా..మరిపెడ పోలీసుల రాత్రి గస్తీతొ వెలుగులోకి అక్రమ దందా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

కలసపాడు మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ, ఎన్నికకు సర్వం సిద్ధం.

కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఫారం–18 అందజేత

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు!పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా...

కొబ్బరి బొండాల మాటున 08 పశువుల అక్రమ రవాణా..మరిపెడ పోలీసుల రాత్రి గస్తీతొ వెలుగులోకి అక్రమ దందా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి : నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీలో పశువుల తరలింపు – ముగ్గురు నిందితులపై...

కలసపాడు మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ, ఎన్నికకు సర్వం సిద్ధం.

కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు వైయస్సార్ కడప జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీన జరుగుతున్న...
error: Content is protected !!