

కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు వైయస్సార్ కడప జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీన జరుగుతున్న ఎంపీటీసీ, మరియు జడ్పిటిసి ఎన్నికలను పర్యవేక్షించేందుకు అధికారులు మరియు బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. రమేష్ కుమార్ మరియు ఎంపీడీవో ఏ ఆర్ ఓ మహబూబ్బి తెలిపారు. మంగళవారం వారు ఎన్నికల గురించి మాట్లాడుతూ కలసపాడు మండలంలో అన్ని పోలింగ్ బూత్ స్టేషన్ ల వద్ద ఖచ్చితమైన బార్కేడులను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే పోలింగ్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్లు ఎన్నికల నియమ నిబంధన ప్రకారం ప్రవర్తించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ కు విరుద్ధంగా ఎవరైనా పాల్పడినట్లయితే తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

