ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిసాగునీరు లేక సరళ సాగర్ వెలవెల.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన

సాగునీరు లేక సరళ సాగర్ వెలవెల.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన

📰 Generate e-Paper Clip

 మదనాపురం మండల పరిదిలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సరళ సాగర్ జలాశయంలో నీటినిలువలు సరిపడలేకఆయకట్టురైతులలో ఆందోళన నెలకొంది,

పొలిటికల్ పవర్ తెలుగుదినపత్రిక పిఎన్ 9టీవీతెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 24.2026.
మదనాపురం మండల పరిదిలోని ప్రపంచప్రఖ్యాతి గాంచిన సరళ సాగర్ జలాశయంలో నీటినిలువలు సరిపడలేకఆయకట్టురైతులలోఆందోళననెలకొంది. మదనాపురం, కొత్తకోట మండలంలో కలిపి 10 గ్రామాల్లో ఆయకట్టు కింద కుడికాలువకు కొన్నూర్, నరసింగాపురం, నెలివిడి గ్రామాలు ఉన్నాయి. ఎడమ కాలువ కింద శంకరమ్మ పేట, దాంతనూర్, మదనాపురం, తీర్మాలయాపల్లి, రామన్ పాడ్, అజ్జకొల్లు, వడ్డెవాట, చర్లపల్లి, గ్రామాలకు చెందిన దాదాపుగా 3500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే జలాశయం పూర్తిసామర్థ్యం22అడుగులు గాను శుక్రవారం నాటికి 7 ఫీట్లు మాత్రమే మీరు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రామన్పాడు జలాశయం నుంచి ముందస్తుగా నీరు తరలించకపోవడంవల్లతగినన్నినీళ్లుజలాశయంలోలేకపోవడం వల్ల ఆయకట్టుకు నీళ్లు విడుదలచేయలేదు.నీళ్లువిడుదలచేయలేకపోవడం వల్ల దాదాపుగా 10 గ్రామాల శివారులో మొత్తం 3500 ఎకరాలుబీడుభూములుఎడారినితలపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న మోటార్లు మొత్తం ఐదు మోటర్లు ఉన్నాయని,వాటిలో నాలుగు మోటర్ల వాడుకలో ఉన్న వాటిలో మూడు మోటార్ల ద్వారానీటినిపంపించేస్తున్నారు. మొత్తానికి నాలుగు మోటార్లు మొత్తంపెడితేపైపులైనుపాతదిగా ఉండటం వల్ల పైపులైను దెబ్బతింటుందనే ఉద్దేశంతో మూడు మోటార్ల ద్వారా రోజుకు 80 క్యూసెక్కుల నీటిని చాలాసార్లుతరలిస్తున్నారు.దీనిద్వారాజలాశయంలో నీటి మట్టంపెరగడంలేదనిఆయకట్టు రైతులు వాపోతున్నారు. అందుకే మిగతా మోటార్లను రిపేర్ చేసి మొత్తం నాలుగు మోటర్లు ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది. అందుకే ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవ చూపి సరళాసాగర్ పైపులైను మోటార్ రిపేరులకు దాదాపుగా కోటి 94 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అయితే ఈ రూపాయలు ఇంకా టెండర్ కాకపోవడం వల్ల పనులు మొదలు కాలేదు. ఎమ్మెల్యే అధికారులు చొరవ చూపి త్వరగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెడితే వచ్చే యాసంగి సీజన్లోఅన్నదాతలకు తొందరగా నీళ్లు అందించవచ్చు రైతులు ఆశిస్తున్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!