ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

📰 Generate e-Paper Clip

– వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ దుకాణాల్లో ప్రమాదకర మందులువిక్రయిస్తేకఠినచర్యలు,జాతీయ రహదారులపై ఆక్రమణలు, అనధికార పార్కింగ్‌ లపై కఠినంగా వ్యవహరించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

– జిల్లాలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా సీసీటీవీ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నాం  జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు23.2026.జిల్లాలోమాదకద్రవ్యాలవినియోగానికిపూర్తిగాఅడ్డుకట్టవేసిడ్రగ్,ఫ్రీజిల్లాగాతీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.శనివారంకలెక్టరేట్,సమావేశమందిరంలో జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డితో కలిసి కలెక్టర్ ఎన్‌కార్డ్ కమిటీ (మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం), రోడ్డు భద్రత టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ,రోడ్డుప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ఘటనలు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు, మెడికల్ కళాశాల, జేఎన్‌టీయూ తదితర విద్యాసంస్థలపై ప్రత్యేకదృష్టిసారించాలనిఅధికారులనుఆదేశించారు.చిన్నారులకు కల్లు విక్రయించకుండా ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచి, ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలపై తనిఖీలు
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆల్ప్రాజోలం,ట్రామడాల్ వంటి ప్రమాదకర మందులను విక్రయించే మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు, దాడులునిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఇప్పటివరకు జిల్లాలో 52 మెడికల్ షాపులపై దాడులు నిర్వహించగా, 12 షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించామని, అందులో 10 షాపుల లైసెన్సులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలం చేయాలి
అన్ని విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ కమిటీలను వెంటనే పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా పని చేసే విధంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నెలా కమిటీ సమావేశంనిర్వహించి,విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలునిర్వహించాలనిసూచించారు.విద్యార్థులు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులుకాకుండాముందస్తు అవగాహన కల్పించడంతో పాటు, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని సూచించారు.

రోడ్డు భద్రతా చర్యలు పటిష్టం చేయాలి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులపై ఆక్రమణలు, అనధికార పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు.నిబంధనలు ఉల్లంఘించే వారికిచలాన్లు,జరిమానాలువిధించాలని, అయినప్పటికీ నిబంధనలు పాటించని వారిపై ఎఫ్‌ఐఆర్‌లునమోదుచేయాలనిసూచించారు.కొత్తకోట ప్రాంతంలో జాతీయ రహదారి సంస్థ ప్రమాదాల నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లారీలు, ఇతర ట్రాన్స్‌పోర్టర్లు పార్కింగ్ సదుపాయాలను వినియోగించేలా ఫుడ్ పిరమిడ్ పార్కింగ్ స్థలం వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్డుప్రమాదాలను తగ్గించేందుకుసుప్రీంకోర్టుమార్గదర్శకాలనుతప్పనిసరిగా అమలు చేయాలని, జాతీయ రహదారులతో పాటు అంతర్గత రహదారులు కూడా సురక్షితంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు: జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డి
జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ప్రతిరోజూ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో ఇప్పటికేయాంటీడ్రగ్,కమిటీలనుఏర్పాటుచేసినప్పటికీ అవి పూర్తిస్థాయిలో క్రియాశీలంగా లేవని, ఈ నెల నుంచి యాంటీ డ్రగ్ కమిటీలను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేసి, విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.అలాగే జిల్లాలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా సీసీటీవీ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెంచి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో డి.ఎస్.పి. బాలాజీ నాయక్, డిటిఓ సురేష్, ఆర్ అండ్ బి ఈ ఈ, డీ ఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, జాతీయ రహదారుల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!