ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

సామాన్యుడి సగటు జీవితం ప్రశ్నగా మారింది

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

 

*నేను 30 రోజులు పనిచేశాను. జీతం* ఇచ్చారు., *ఆదాయపు పన్ను* అన్నారు.
…… ఇచ్చాను.
*ప్రొఫెషనల్ ట్యాక్స్* అన్నారు,
……ఇచ్చాను
*మొబైల్ కొనుగోలు పై పన్ను* అన్నారు
……ఇచ్చాను.
*రీఛార్జ్* చేశా పన్ను
…..ఇచ్చాను.
*డేటా* పన్ను ఇచ్చా.
*విద్యుత్తు పన్ను* ఇచ్చా.
*ఇంటి పన్ను* ఇచ్చా
*టీవీ బిల్లు పై పన్ను*
*పిల్లల ఫీజుల పై పన్ను*
…..అన్నీ ఇచ్చాను.
*కారుకి పన్ను* అన్నారు.
…..ఇచ్చాను.
*పెట్రోలు పై పన్ను* అన్నారు
…….చెల్లించా.
*సేవ’*అన్నారు
………పన్ను ఇచ్చాను.
*రోడ్డుపై పన్ను* అన్నారు
*టోల్‌ పై* పన్ను
ఆపై *లైసెన్స్ మేడ్* ‘ట్యాక్స్’ వచ్చింది
….*కిక్కురుమనకుండా అన్నీ ఇచ్చాను*.
*రెస్టారెంట్‌లో తిన్నా* పన్ను
…..చెల్లించా.
*పార్కింగ్ పన్ను*
….చెల్లించా.
*నీరు తీసుకున్నా* పన్ను
……చెల్లించా
*ఇంట్లో కసువు బయట వేసేందుకు పన్ను*
…….చెల్లించా
*టాయ్లెట్ నుండి వేస్ట్ sewage* అన్నారు
…..దానికీ పన్ను చెల్లించా
*తినేందుకని కార్డుమీద* సామానులు కొనుక్కున్నా
పన్ను …..చెల్లించా
*రేషన్ కొనుగోలు చేశా*
పన్ను చెల్లించా
*బట్టలు కొనుగోలు* చేశా
పన్ను చెల్లించా
*పుస్తకాలు* తీసుకున్నా
పన్ను ఇచ్చా
*మరుగుదొడ్డికి వెళ్లా*
పన్ను చెల్లించా
*మందులు తీసుకున్నా*
పన్ను చెల్లించా
*గ్యాస్* ఇచ్చారు
పన్ను చెల్లించా.
వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి,* *ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు,* *లంచాల పేరుతో డబ్బులు చెల్లించి,*
పొరపాటున ఏ డ్రామా నో ఆడి,
*ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ*
*మీకు పన్ను కట్టా.*
కానీ *ఆ జీతం నుండి*
*ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి?*
*ఎవరయినా జవాబు చెప్తారా ?*
*మేము జీవితాంతం పని చేసి,*
*పన్నులు కట్టిన తరువాత కూడా*
*మాకు సామాజిక భద్రత లేదు*.
*ఉచిత వైద్య సౌకర్యం లేదు,*
*అధ్వాన్నమైన రోడ్లు*,
*వీధి దీపాలు వెలగవు,*
*గాలి కాలుష్యం,*
*నీరు కాలుష్యం,*
*పండ్లు, కూరగాయలు….*
….ఇలా *అన్నీ విషపూరితమైనవి,*
*ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి,*
*ముసలి వాడినయేంతవరకు పన్ను కట్టి*
*పన్ను మీద పన్ను కట్టి*
*చేసిన సర్వీసు లో ఆదా చేసుకుని*
*పింఛను తీసుకుంటే* –
దానిమీద కూడా పన్ను అన్నారు :
*అదీ కడ్తున్నా.*
*నా శవాన్ని తగలబెట్టేందుకూ పన్నా ?*
*ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం*
కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది.
*అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు*
వాటిల్లో *ప్రతిచోటా కూడా*
*మీకు పన్నులు – మాకు అప్పులు.*
కానీ……
*ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి?*
*అవినీతిలోకి, ఎన్నికల్లోకి*,
*ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి,*
*విజయ్ మాల్యా* లాంటివారు
*దోచుకొని పారిపోవటానికి,*
*ధనికుల ప్రకటించే మోసపూరిత*
‘*దివాలాలు’ పూడ్చటానికి*-

స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కార్లు, జీతాలు సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడంలోకి, మాకు కథలు చెప్పి “జండూ బామ్” రాయడానికి ఖర్చు పెట్టారు._*

*ఇప్పుటికైనా చెప్పండి, దొంగ ఎవరో.?*

*మనమంతా కూడా ఈ దేశస్థులమే అయినాసరే, ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము. కదా.!*

ఇది

*ఓ సామాన్యుడిగా – సగటు *భారతీయుడు గా *
*నా ఆవేదన*.

ప్రపంచవ్యాప్తంగా GST వసూలు చేస్తున్న

*175 దేశాలలో 28% GST స్లాబ్ ఉన్న ఏకైక దేశం*

*మన దేశమే*.

*ఇంత భయంకరంగా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ*

*దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత*

*అప్పు దేనికి చేసినట్లు – చేస్తున్నట్లు ???*

-హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18%

-లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18%

-మెడిసిన్ మీద 12%

-మెడికల్ సర్వీస్ మీద 12%

*బహిష్టు సమయంలో మహిళలు ఉపయోగించే సానిటరీ ప్యాడ్స్ మీద 12%*

*బట్టల మీద 12%*

*చెప్పులు మీద 12%*

*పాప్కార్న్ మీద 18 %*

*పాతకారుల అమ్మకం మీద 18%*

*ఉద్యోగ రుసుము మీద 18 %*

*పాల మీద 5%*

*పెరుగు మీద 5%*

*పన్నీర్ మీద 5%*

*బంగారు కొనుగోలు మీద 3%*

*ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ మీద 28%*

*మోటార్ వెహికల్స్ కార్స్ అండ్ బైక్స్ మీద 28%*

*స్టీల్ మీద 18%*

*ఐరన్ మీద 18%*

*సిమెంట్ మీద 28%*

*ఫ్లోరింగ్ టైల్స్ మీద 5%*

*వాల్ టైల్స్ మీద 28%*

ఇలా వ్రాసుకుంటూ పోతే మొత్తం ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలు చేస్తున్నారు!అయినప్పటికీ :
*మనదేశంలో పేదరికం, ఆహారపు కొరత, అప్పులు!పట్టి పిడిస్తున్నాయి*.
…..*ఎవరిది లోపం ?*
…*పాలకులదా ?*
………*ప్రజలదా?*
స్వాతంత్ర్యం రాకముందు మనదేశ సంపదను *బ్రిటీష్ వాళ్ళుకొల్లగొట్టారు* అని చరిత్రలో రాసారు!ఇప్పుడు *మనకు స్వాతంత్ర్యం వొచ్చింది.*
*రాజ్యాంగం అమలులో వుంది*.
*మనదేశాన్ని కొల్లగొడుతున్నదేవరు?*

*అనేది పెద్ద ప్రశ్న!.….*నిజం నన్ను ఎప్పటినుంచో వేదిస్తున్న ప్రశ్న

నాగరాజు  రెడ్డి

9160591108

9848515889

 

Latest Articles

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.....

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత,...

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..- విఠలేశ్వర స్వామి ఆలయంలో...

సోలార్ విద్యుత్తు ప్రారంభం…

అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ ను ప్రారంభించినఎస్ ఈ .రాజేశ్వర్....పొలిటికల్...

Related Articles

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. *వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి...

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి, పేద‌ల‌...
error: Content is protected !!