ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeతెలంగాణసింగరేణి అధికారుల నిరసన దీక్షలకు షెడ్యూల్డ్ కులాల జేఏసీ సంఘీభావం

సింగరేణి అధికారుల నిరసన దీక్షలకు షెడ్యూల్డ్ కులాల జేఏసీ సంఘీభావం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి సింగరేణి మైనింగ్ అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ సంపూర్ణ మద్దతుగా సంఘీభావం తెలియజేశారు. రుద్రంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం ముందు వర్క్ షాప్ ఏజీఎం కలవల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష మంగళవారం జరిగింది. ఈ దీక్షా శిబిరాన్ని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి సంఘీభావం వ్యక్తం చేశారు.సింగరేణి మైనింగ్ అధికారుల డిమాండ్లు నెరవేరాలని కోరారు. కార్మికులు,యాజమాన్యం, ప్రభుత్వం సమన్వయం తో సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్1947 లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కనీస వేతనం, బోనస్, జీతంతో కూడిన సెలవులు కల్పించాలని ప్రభుత్వంతో చర్చించి సాధించి పెట్టారని అన్నారు.పేదరికమే దేశానికి ప్రజల శత్రువు కనుక ధనవంతులు పేదలను ఆదరించే విధంగా తోడ్పాటు అందించాలని అంబేద్కర్ కోరుకున్నారని శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్, బొమ్మెర పవన్ కళ్యాణ్, ఎనగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!