111 మంది లబ్ధిదారులకు 28 లక్షల 20 రెండు వేల రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ చేసిన
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 17 2026: కేంద్రం లోని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నివాసంలో ఆదివారం రోజు 111 మంది లబ్ధిదారులకు 28 లక్షల 20 రెండు వేల రూపాయల విలువ గల చెక్కులను డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసుకోలేని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని అన్నారు. పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతూ, వారి ఆరోగ్యానికి కొండంత ఆసరాగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ దేవన్న యాదవ్, వనపర్తి జిల్లా మాజీ సోషల్ మీడియా కోకో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల చంద్రశేఖర్, శ్రీ రంగాపురం మండల జై కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, పెబ్బేర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనిల్ నాయుడు, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గట్టు మన్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దిలేటి శ్రీరంగాపురం సర్పంచ్, చిట్టిబాబు పెద్ద మునగల్చేడు సర్పంచ్, ఈశ్వర్ రెడ్డి, ఎంట్ల రవి, యుగంధర్ రెడ్డి, కొండన్న, బాల్ రాజు, సత్యం, బాలచందర్, రఘు, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
