ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసిన కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసిన కేటీఆర్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో: బాజ శేఖర్ జులై 23 2026: హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబరీనా సంస్థకు సంబంధించిన అంశంలో తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ, 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. నిర్దిష్ట గడువులోగా క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా కూడా దాఖలు చేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

కేటీఆర్ ప్రధాన వ్యాఖ్యలు:

గ్లోబరీనా సంస్థ అంశంలో సీఎం చేసిన ఆరోపణలు నిరాధారమైనవి 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆధారాలు లేకుండా మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని వారు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!