డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య సేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి (CMRF) రూ.45,31,100/- రూపాయల విలువైన 150 చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు లబ్ధిదారులకు అందజేశారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నా రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రేపటికి సెప్టెంబర్ ఒకటి నాటికి విజయవంతంగా వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను పాలనకు కేంద్ర బిందువుగా చేసుకొని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ వెయ్యి రోజుల పరిపాలన తెలంగాణ ప్రగతిలో కొత్త అధ్యాయన్ని నమోదు చేసుకుంటుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి పేద వారికి అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కోరారు. గత ప్రభుత్వ అప్పులను తీరుస్తూనే,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నామని అన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ లేనివారికి చికిత్స అనంతరం CMRF ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను గుర్తించి సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం పేదోళ్ల ఆరోగ్యానికి కొండంత ఆసరాగా నిలుస్తుందని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మానవతా ధృక్పథంతో అందరికీ CMRF చెక్కులను అందజేస్తున్నామని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకులు అక్తర్,వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, సోషల్ మీడియా కోకో ఆర్డినేటర్ చంద్రశేఖర్, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున,వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల చంద్రశేఖర్ , పెబ్బేర్ మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనిల్, అయ్యవారిపల్లె సర్పంచ్ కురుమన్న,సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, సహదేవుడు, మన్యం యాదవ్, రాముడు, హరిబాబు రెడ్డి, ఇమ్రాన్, శ్రీధర్, వెంకటేష్ సాగర్, ఆనంద్ సాగర్, శివ నారాయణ, చెన్నయ్య, వెంకటేష్, నాగన్న గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గౌడ్, నరసింహ, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

