పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులుగా రాజేంద్రప్రసాద్ యాదవ్ ను నియమించడం జరిగింది. రాజేంద్రప్రసాద్ యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, గ్రామపంచాయతీలకు మరిన్ని అధికారాలు, వనరులు అందితే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని, రాజీవ్ గాంధీ విశ్వసించారని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం రాజీవ్ గాంధీ గొప్ప ఆలోచన అని,ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి నియమ నిబంధనలతో కష్టపడి పనిచేస్తే పార్టీ అధిష్టానం ఖచ్చితంగా గుర్తించి గుర్తింపు ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజేంద్రప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించడం అభినందనీయమని ,కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు, పదవులు చేపట్టాలని డాక్టర్ చిన్నారెడ్డి ఆకాంక్షించారు. రాజేంద్రప్రసాద్ యాదవ్ నాయకత్వంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ప్రజలకు మరింత చేరువ కావాలని డాక్టర్ చిన్నారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకులు అక్తర్, వనపర్తి జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ దేవన్న యాదవ్, సోషల్ మీడియా కోకో- ఆర్డినేటర్ చంద్రశేఖర్, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల చంద్రశేఖర్, పెబ్బేర్ మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనిల్, అయ్యవారిపల్లె సర్పంచ్ కురుమన్న, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, సహదేవుడు, మన్యం యాదవ్, రాముడు, హరిబాబు రెడ్డి, ఇమ్రాన్, శ్రీధర్, వెంకటేష్ సాగర్, ఆనంద్ సాగర్, చెన్నయ్య, వెంకటేష్, నాగన్న గౌడ్, శ్రీనివాస్ రెడ్డి పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
