ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణసైబరాబాద్ పరిధిలో సబ్-ఇన్‌స్పెక్టర్లకు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పై ప్రత్యేక అవగాహన సదస్సు

సైబరాబాద్ పరిధిలో సబ్-ఇన్‌స్పెక్టర్లకు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పై ప్రత్యేక అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

సీపీ డా. ఎం. రమేష్ శేరిలింగంపల్లి పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సైబరాబాద్ సీపీ.ఎం. రమేష్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి లోసబ్ ఇన్స్పెక్టర్ సీపీ ఆఫీస్ ఆడిటోరియంలో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాండ్ర పాల్గొని వ్యక్తిత్వ వికాసం, ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ నియంత్రణ, నాయకత్వ లక్షణాల పెంపు, వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసు విధులలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మానసిక దృఢత్వంతో విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ… ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, హెల్త్ మేనేజ్‌మెంట్‌తో పాటు కుటుంబ జీవితం, ఉద్యోగ బాధ్యతల మధ్య సమతుల్యతను పాటించడం ప్రతి అధికారికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మంచి ఆలోచనలు, ఉన్నత ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగితే జీవితంలో విజయాలను సాధించడం సులభమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమను తాము ప్రతిరోజూ విశ్లేషించుకుంటూ, భవిష్యత్ లక్ష్యాల దిశగా కృషి చేయాలని సూచించారు.పోలీసు శాఖ ఒక విశ్వసనీయ బ్రాండ్ అని, దానికి తగిన నైతిక విలువలు, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథాన్ని ప్రతి అధికారి కాపాడాలని సీపీ సూచించారు. దర్యాప్తు నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, ప్రజలతో సమన్వయం, చట్టబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కేసుల దర్యాప్తులో నిజాయితీ, నిబద్ధత, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు, ఒత్తిళ్లు, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని, అపజయాలను పాఠాలుగా స్వీకరించి ముందుకు సాగాలని సీపీ సూచించారు. నేటి బిజీ జీవితంలో నైతిక విలువలపై దృష్టి తగ్గుతోందని, వాటిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “అపకారికి ఉపకారం” అనే విలువను ఆచరిస్తూ సమాజంలో ఆదర్శప్రాయమైన పోలీసు అధికారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎవరూ పరిపూర్ణులు కాదని, నిరంతర అభ్యాసం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతోనే ఉన్నత విజయాలు సాధించగలమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!