వనపర్తి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిం చిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు తిరుమల హిల్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, అనంతరం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ తదితర మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్ర్యం అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, దేశ ప్రజల హక్కులు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు మరియు దేశ సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిన రోజని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని మరింత బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


